Headlines

కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు.. 21 రోజుల పాటు గణనాథుడి వైభవం!


బ్రహ్మోత్సవాలను విజయ వంతం చేసేందుకు ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించగా వికలాంగులు, వయో వృద్దులు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసారు. కాణిపాకం ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా అలంకరించిన దేవస్థానం గణపతి హోమం యధావిధిగా నిర్వహించనుంది. వినాయక చవితి రోజున చందనం అలంకరణతో దర్శనం ఇవ్వనున్న వినాయకుడికి గణేష్ మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇక అదే రోజు పుష్పకావిడి సమర్పించనుండగా రాత్రి కాణిపాకం ఆలయ వీధుల్లో సిద్ధి బుద్ధి సమేత గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 15న ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా రాత్రి హంస వాహనంపై గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *