టెక్ మార్కెట్లో పూటకో కొత్త ఐటం లాంఛ్ అవుతూనే ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం స్మార్ట్ వాచ్ లకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కేవలం సమయం కోసం మాత్రమే ఉపయోగపడే వాచ్ లను ఇప్పుడు ఈ రేంజ్ లో అప్డేట్ చేసి అందరికీ షాక్ ఇస్తున్నారు. మన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, ఫిట్నెస్, కాల్స్, మెసేజ్‌లకు స్పందించడం వంటి అనేక పనుల కోసం ఉపయోగపడే ఆల్ ఇన్ వన్ గాడ్జెట్ గా స్మార్ట్ వాచ్ మారిపోయింది. అయితే మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌వాచ్ కొనాలంటే ..వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు, మంచి డిజైన్.. కోసం ఎదురుచూస్తున్న వారికి MELBON గుడ్ న్యూస్ ప్రకటించింది.
H9 Smartwatch లాంఛ్..
MELBON కొత్తగా H9 Smartwatch రిలీజ్ చేసింది. తక్కువ ధరలోనే బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్.. SpO2, స్లీప్ మానిటర్ ,వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అలానే స్టైలిష్ గ్రే స్ట్రాప్ తో వస్తుండడం టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. అలానే ఫ్రీ సైజ్ కావడం వల్ల ఎవరి మణికట్టుకైనా ఈజీగా, సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా కేవలం రూ.902 ధరలోనే లభ్యమవుతున్న ఈ స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు రకాలకు సపోర్ట్ చేస్తుంది. దీని పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
H9 Smartwatch ఫీచర్స్..
ఈ వాచ్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ అనే చెప్పాలి. మీ స్మార్ట్ ఫోన్‌ను బ్లూటూత్ ద్వారా వాచ్‌కు కనెక్ట్ చేయడం వల్ల, ఫోన్ జేబులో ఉన్నా సరే.. నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు, ప్రయాణాల్లో.. ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేసే సమయంలో.. ఫోన్ తీయాల్సిన అవసరం లేకుండానే కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేందుకు ఇది ఎంతో ఉపయోగ పడుతుంది.
హెల్త్ ఫీచర్లు..
హార్ట్ రేట్ మానిటర్, SpO2 మానిటర్, స్లీప్ మానిటర్ ఉన్నాయి. రోజూ వాకింగ్, రన్నింగ్ లేదా జిమ్ చేసేవారి కోసం మీరు వేసే అడుగులు, ఖర్చు చేసిన కేలరీలు, ప్రయాణించిన దూరాన్ని ఇది ఖచ్చితంగా లెక్కిస్తుంది.
స్మార్ట్ నోటిఫికేషన్లు..
మీ ఫోన్‌కు వచ్చే వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్, ఇతర సోషల్ మీడియా నోటిఫికేషన్లను నేరుగా వాచ్ స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు.
బ్యాటరీ..
ఈ స్మార్ట్‌వాచ్ మంచి బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.