Headlines

క్యాబ్ బుక్ చేసిన 12 నిమిషాలు వెయిటింగ్.. మరపురాని ప్రయాణం అందించిన డ్రౌవర్!


క్యాబ్ బుక్ చేసిన 12 నిమిషాలు వెయిటింగ్..  మరపురాని ప్రయాణం అందించిన డ్రౌవర్!

క్యాబ్ బుక్ చేసినప్పుడు సాధారణంగా డ్రైవర్ ఎవరా? ఎంతసేపట్లో వస్తారా? అని చూస్తుంటాం. కానీ ఢిల్లీలో ఓ మహిళకు మాత్రం ఉబెర్ క్యాబ్ బుకింగ్ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. క్యాబ్ డ్రైవర్‌గా ఓ మహిళ రావడమే అందుకు కారణం. గత పదేళ్లుగా క్యాబ్‌లలో ప్రయాణిస్తున్నా ఒక్క మహిళా డ్రైవర్‌ను కూడా చూడని ఆమెకు, ఢిల్లీలో ఎదురైన ఈ అనుభవం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ కథ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

12 నిమిషాల నిరీక్షణ.. ఊహించని సర్‌ప్రైజ్!

‘బీటౌన్ బైట్స్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఓ మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె గత పదేళ్లుగా ముంబైలో క్యాబ్‌లలో ప్రయాణిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా మహిళా ఉబెర్ డ్రైవర్ ఎదురుకాలేదని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. కొద్దిసేపటికే యాప్‌లో డ్రైవర్‌గా ‘భావన’ వస్తున్నట్లు నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె వెంటనే యాప్ తెరిచి చూడగా, నిజంగానే డ్రైవర్ ఒక మహిళ అని తెలిసింది. క్యాబ్ కోసం సుమారు 12 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చినా, ఆ నిరీక్షణ తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.

కారు పరిశుభ్రత.. భద్రత.. ఆత్మవిశ్వాసం!

భావన నడుపుతున్న కారు ఎంతో శుభ్రంగా ఉందని, లోపల మ్యాగజైన్లు కూడా చక్కగా అమర్చారని ఆమె వివరించారు. ప్రయాణం మొత్తం తనకు ఎంతో సురక్షితంగా అనిపించిందని చెప్పారు. అయితే ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చింది కారు మాత్రమే కాదు.. భావనతో జరిగిన సంభాషణ కూడా.

భావన తన ఉద్యోగం గురించి, డ్రైవింగ్‌పై తనకున్న ఆసక్తి గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. మహిళా డ్రైవర్లకు ఉబెర్ కల్పిస్తున్న అవకాశాల గురించి వివరించారు. రోజుకు దాదాపు 12 గంటల పాటు డ్రైవింగ్ చేస్తానని, త్వరలో ముంబై సందర్శించాలని ఉందని చెప్పారు. ఢిల్లీ శీతాకాలపు పూల గురించి కూడా ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.

మహిళలకు మహిళలే అండగా ఉండాలి!

ఈ ప్రయాణం తనకు భవిష్యత్తులో చూడాలనుకుంటున్న భారతదేశానికి ఒక చిన్న ఉదాహరణగా అనిపించిందని ఆ మహిళ పేర్కొన్నారు. ఎక్కువ మంది మహిళలు వాహనాలు నడుపుతూ, స్వతంత్రంగా సంపాదిస్తూ, తమకు నచ్చిన పనిలో ఆనందాన్ని పొందాలని ఆకాంక్షించారు. అంతేకాదు.. మహిళలు ఇతర మహిళలకు అవకాశాలు కల్పిస్తూ, సురక్షితమైన వాతావరణాన్ని నిర్మించే సమాజం రావాలని అభిప్రాయపడ్డారు.

చివరగా ‘మరింత మంది భావనలు రావాలి.. డ్రైవింగ్ చేసే మహిళలు ఇంకా ఎంతో మంది ఉండాలి’ అంటూ తన పోస్టును ముగించారు. ఒక మహిళకు లభించిన అవకాశం మరో మహిళలో భద్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంచగలదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Beetown Bites | Food Lover (@beetownbites)

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *