Headlines

కడుపు ఉబ్బరం నుంచి గుండెపోటు వరకు అన్నింటినీ నివారించే వెల్లుల్లి లేహ్యం..! ఎలా తయారు చేయాలంటే..


వెల్లుల్లి లేహ్యం అనేది ఆయుర్వేదం, సిద్ధ వైద్యంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయ అల్పాహారం/ఔషధం. ముఖ్యంగా ప్రసవానంతరం మహిళల్లో పాలు పెరగడానికి, గర్భాశయాన్ని శుద్ధి చేయడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లి లెహ్యం పూర్తి ప్రయోజనాలు తెలియాలంటే కంప్లీట్‌ డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే..

వెల్లుల్లి లేహ్యం ఆరోగ్య ప్రయోజనాలు:

ప్రసవానంతరం మహిళలకు మేలు: ప్రసవించిన బాలింతలకు ఈ లేహ్యం ఎంతో శ్రేయస్కరం. ఇది తల్లి పాలు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే గర్భాశయాన్ని శుభ్రపరచడంలో, ప్రసవానంతరం వచ్చే బలహీనతను తగ్గించడంలో తోడ్పడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ చిన్న ముక్క లేహ్యం తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

ఇవి కూడా చదవండి



కొలెస్ట్రాల్ మరియు గుండె ఆరోగ్యం: వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో బాగా సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి పెంపు: ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి.

కీళ్ల నొప్పుల ఉపశమనం: వాత సంబంధిత సమస్యలు మరియు కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.

తయారీకి కావలసిన పదార్థాలు:

ఒలిచిన వెల్లుల్లి – 1 కప్పు

పాలు – 1 కప్పు

బెల్లం తురుము – 1 కప్పు

నెయ్యి – 3-4 స్పూన్లు

సొంటి, పిప్పళ్లు, మిరియాల పొడి – 1 స్పూను

ఏలకుల పొడి – అర స్పూను

తయారీ విధానం: ముందుగా ఒలిచిన వెల్లుల్లి రెబ్బలను పాలలో వేసి, మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన వెల్లుల్లిని చల్లార్చి, మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఒక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి, ఈ వెల్లుల్లి పేస్ట్‌ను పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం కరిగి పాకంలా మారిన తర్వాత సొంటి, మిరియాల పొడి, ఏలకుల పొడి వేయాలి. మిశ్రమం దగ్గరపడే వరకు తిప్పుతూ, మధ్యమధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి. మిశ్రమం పాత్రకు అంటుకోకుండా లేహ్యంలా మారిన తర్వాత స్టవ్ ఆపేయాలి.

చల్లారిన తర్వాత దీనిని గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. రోజూ ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు టీస్పూన్ మోతాదులో తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *