India vs Sri Lanka Women, Asian Games Final Result: భారత మహిళల జట్టు రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడింది. శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచిన హర్మన్ ప్రీత్ సేన 2022 తర్వాత మరోసారి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇందులో స్మృతి మంధాన 79, రిచా ఘోష్ అజేయంగా 49, షఫాలీ వర్మ 48 పరుగులు చేశారు. మంధాన, షఫాలీ తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మంధాన 45 బంతుల్లో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 11,000 పరుగులు కూడా పూర్తి చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 19 పరుగులు చేసింది. శ్రీలంక తరఫున సుగంధికా కుమారి, కవిషా దిల్హరి, చాముది ప్రభోద ఒక్కో వికెట్ తీశారు.