ఓరీ దేవుడో మీకు ఇష్టమైన బంగారమే మీ కష్టాలకు కారణం..? ఈ 4 రాశుల వారు గోల్డ్‌ ధరిస్తే అంతేనట!

ఓరీ దేవుడో మీకు ఇష్టమైన బంగారమే మీ కష్టాలకు కారణం..? ఈ 4 రాశుల వారు గోల్డ్‌ ధరిస్తే అంతేనట!


జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి లోహానికి ఒక గ్రహంతో సంబంధం ఉంటుంది. బంగారం గురు గ్రహానికి (Jupiter) సంకేతం. అందుకే కొన్ని రాశుల వారికి బంగారం ధరించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బంగారం అందరికీ అదృష్టాన్ని తీసుకురాదని అంటున్నారు.. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, కొన్ని రాశుల వారికి బంగారం ధరించడం వల్ల ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు లేదా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాంటి రాశులు ఏవో తప్పక తెలుసుకోవాలి.

వృషభ రాశి (Taurus):

ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు, గురువు (బంగారం అధిపతి) మధ్య శత్రుత్వం ఉంటుంది. వృషభ రాశి వారు బంగారం ధరించడం వల్ల అనవసర ఖర్చులు పెరగడం, సుఖ సంతోషాలకు ఆటంకం కలగడం వంటివి జరగవచ్చు.

మిథున రాశి (Gemini):

మిథున రాశి అధిపతి బుధుడు. బుధుడు, గురువుల మధ్య సంబంధం అంత అనుకూలంగా ఉండదు. ఈ రాశి వారు బంగారం ధరిస్తే వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా బంగారు వస్తువు ధరించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

కన్య రాశి (Virgo):

కన్య రాశి వారికి బంగారం ధరించడం వల్ల వారి వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆరోగ్యంపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. వీరికి బంగారం కంటే వెండి ధరించడం అత్యంత శుభప్రదం అంటున్నారు నిపుణులు.

కుంభ రాశి (Aquarius):

కుంభ రాశికి శని దేవుడు అధిపతి. శని, గురువుల మధ్య సమన్వయం కుదరదు. కుంభ రాశి వారు బంగారం ధరించడం వల్ల వారి పనులు నెమ్మదిగా సాగుతాయి. మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది.
కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీ జాతకంలో గురు గ్రహం (బృహస్పతి) స్థితిని బట్టి బంగారం ప్రభావం ఉంటుంది. పైన పేర్కొన్న రాశుల వారు బంగారాన్ని ఆడంబరం కోసం ధరించే ముందు, ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవడం ఉత్తమం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *