Headlines

ఐపీఎల్ 2026 నుంచి లక్నో ఔట్.. కట్‌చేస్తే.. ముగ్గురు ప్లేయర్లకు గుడ్‌బై చెప్పేసేందుకు రెడీ..?

ఐపీఎల్ 2026 నుంచి లక్నో ఔట్.. కట్‌చేస్తే.. ముగ్గురు ప్లేయర్లకు గుడ్‌బై చెప్పేసేందుకు రెడీ..?


LSG Released Players 2027: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అధికారికంగా ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా నిలిచింది. రిషబ్ పంత్ నాయకత్వంలోని ఈ జట్టు, చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి.

ప్రస్తుతం, LSG పాయింట్ల పట్టికలో 11 మ్యాచ్‌లలో కేవలం 6 పాయింట్లతో అడుగున ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 8 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం రిషబ్ పంత్ టీం ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో తెలియజేస్తోంది. స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ లేకపోవడం, తరచూ ప్రయోగాలు చేయడం జట్టు వైఫల్యానికి ప్రధాన కారణాలుగా మారాయి. IPL 2027 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది.

LSG వదిలిపెట్టే అవకాశం ఉన్న ప్రధాన ఆటగాళ్లు:

రిషబ్ పంత్: రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన పంత్, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. వరుసగా విఫలమవ్వడం, బ్యాటింగ్ పొజిషన్ మార్పులు జట్టుకు నష్టాన్ని చేకూర్చాయి. భారీ ధర దృష్ట్యా అతన్ని విడుదల చేసి ఆ నిధులతో ఇతర విభాగాలను బలోపేతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.

ఆయుష్ బదోని: 2022 నుంచి జట్టుతో ఉన్నా, ఇప్పుడు అతని స్థానం ప్రశ్నార్థకంగా మారింది. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే ప్లేయర్ల వైపు మొగ్గు చూపుతున్న LSG, నెమ్మదిగా ఆడే బదోనిని వదిలేసే ఛాన్స్ ఉంది.

మయాంక్ యాదవ్: వేగంతో ఆకట్టుకున్నా, ఫిట్‌నెస్ సమస్యలు మయాంక్‌ను వేధిస్తున్నాయి. గత రెండు సీజన్లలో గాయాల వల్ల అతను మెజారిటీ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. షమీ, నోర్కియా వంటి బౌలర్లు అందుబాటులో ఉండటంతో మయాంక్‌ను వేలంలోకి వదిలేయవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *