Headlines

Nuvvu Nuvvu Song: నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ? మనం ఇన్నిసార్లు విన్నా ఎప్పుడూ గమనించలేదు..

Nuvvu Nuvvu Song: నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ? మనం ఇన్నిసార్లు విన్నా ఎప్పుడూ గమనించలేదు..


తెలుగు సినీ చరిత్రలో సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ఖడ్గం. 2002లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఈ చిత్రానికి టీవీల్లో వచ్చే రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సంగీత, ఉత్తేజ్, బ్రహ్మాజీ వంటి స్టార్స్ అందరూ కలిసి నటించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అందులో “నువ్వు నువ్వు” పాట ఒకటి. ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు సిరివెన్నెల. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాట వెనుక అర్థం వివరించారు. సిరివెన్నెల మాట్లాడుతూ.. “సైన్స్ పరిభాషలో మనుషులందరూ ఒక్కటే. శారీరక నిర్మాణంలో ప్రత్యుత్పత్తి కోసం కొన్ని తేడాలు ఉన్నప్పటికీ, మనిషితనంలో గానీ, ప్రేమానుభూతిని వ్యక్తపరచడంలో గానీ ‘ఇది ఆడ భాష’, ‘ఇది మగ భాష’ అనే భేదం ఉండదు” అని అన్నారు.

“నా పంతం నువ్వు.. నా సొంతం నువ్వు.. నా అంతం నువ్వు” లిరిక్స్ విషయానికి వస్తే.. ఇది ఒక ప్రేమికుడికి-ప్రేమికురాలికి మధ్య అత్యంత గాఢమైన అనుబంధం ఉన్న ఏ ఇద్దరి మధ్య అయినా వర్తిస్తుందని ఆయన వివరించారు. సమాజం అందాన్ని శరీర కొలతలతో లేదా బాహ్య రూపంతో కొలవడానికి ప్రయత్నిస్తోంది, కానీ అది సరైనది కాదని..అందం అనేది అనుభూతిగా మారినప్పుడు మాత్రమే మనిషిలో ప్రేమానురాగాలు కలుగుతాయని, వస్తురూపంగా చూసినప్పుడే వికృత ఆలోచనలు వస్తాయని ఆయన అన్నారు.

దాదాపు మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఏ దర్శకుడు లేదా నిర్మాత కూడా తన నియమాలను దాటి రాయమని బలవంతం చేయలేదని పేర్కొన్నారు. నేను రాసే పాట నా జేబులో ఎప్పుడూ భద్రంగా పెట్టుకునే పెన్ (Pen) లాంటిదై ఉండాలి కానీ, వాడుకుని పారేసే అగ్గిపుల్ల లాంటిది కాకూడదు. నా పాట శాశ్వతంగా శ్రోతల గుండెల్లో నిలిచిపోవాలి అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

నువ్వు నువ్వు సాంగ్..



ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *