Headlines

ఏపీ DSC 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్షల పూర్తి పూర్తి షెడ్యూల్‌ ఇదే!


అమరావతి, నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్రంలో డీఎస్సీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి నవంబరు 30 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. గత నెలలో డీఎస్సీకి సంబంధించి సంక్షిప్త ప్రకటన విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. నవంబరు 4న 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఏ విభాగంలో ఎన్ని పోస్టులంటే?

మొత్తం 2,721 పోస్టులను వివిధ విభాగాల వారీగా భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్‌ పాఠశాలలు (ఎస్‌ఏ, ఎస్జీటీ) 2,111 పోస్టులు, ప్రత్యేక విద్య (ఎస్‌ఏ, ఎస్టీటీ) 350 పోస్టులు వరకు ఉన్నాయి. ఇక సొసైటీలు, ఇతర యాజమాన్యాలు (ప్రిన్సిపల్‌, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ) 260 పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి



డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

డీఎస్సీ పరీక్షలను డిసెంబరు 20 నుంచి జనవరి 13 వరకు కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థుల సన్నద్ధత కోసం డిసెంబరు 5న ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. డిసెంబరు 14 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. చివరి పరీక్ష పూర్తయిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక ఆన్సర్‌ కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలియజేసేందుకు అభ్యర్థులకు వారం రోజుల గడువు ఇవ్వనున్నారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం మరో వారానికి తుది ఆన్సర్‌ కీని విడుదల చేయనున్నారు. 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా గడువులోగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *