అందాల భామ అనన్య నాగళ్ల వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికే ఈ అమ్మడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది అనన్య. ఈ ముద్దుగుమ్మ మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే నటనతో కట్టిపడేసింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అనన్యకు ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. నటనతో పాటు గ్లామర్ పరంగానూ ఈ చిన్నది ప్రేక్షకుల మనసు దోచేస్తుంది.
మూగ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావడం పిచ్చితనం అన్నారు.. అందం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ అనన్య నాగళ్ల అభిమానులను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనన్య నాగళ్ల. పెద్ద సినిమా ఛాన్స్ లకోసం ఎదురుచూస్తుంది. బడా హీరోల సినిమా ఛాన్స్ వస్తే ఈ ముద్దగుమ్మ స్టార్ డమ్ సొంతం చేసుకుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే అనన్యకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే.. అవమానాలు ఎదుర్కొందన్న దర్శకుడు
ఈ వీడియోలో అనన్య ఓ ఈవెంట్ కు వెళ్లగా అక్కడి ఫోటోగ్రాఫర్స్ అనన్యను ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. ఇంతలో ఓ వ్యక్తి మేడం మీ ఈయర్ రింగ్స్ బాగున్నాయి అని అన్నాడు. దాంతో నవ్వుతూ థాంక్యూ చెప్పిన అనన్య.. డ్రస్ బాలేదా.? అని క్యూట్ గా అడిగింది. ఇంతలో మరో వ్యక్తి డ్రస్ కంటే మీరే బాగున్నారు అని అన్నాడు. దాంతో షాక్ అయిన అనన్య నవ్వుతూ ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.