EPFO సంచలన నిర్ణయం.. ఇకపై UPI ద్వారా పీఎఫ్ నగదు ఉపసంహరణ.. మే నెల నుంచే ప్రారంభం!

EPFO సంచలన నిర్ణయం.. ఇకపై UPI ద్వారా పీఎఫ్ నగదు ఉపసంహరణ.. మే నెల నుంచే ప్రారంభం!


EPF UPI Withdrawal: పీఎఫ్ ఖాతాదారులకు నగదు విత్ డ్రా ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. సాధారణంగా పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ కావడానికి పట్టే సమయాన్ని తగ్గించి, వేగంగా నిధులు అందేలా ఈ UPI విత్ డ్రా వ్యవస్థ పనిచేస్తుంది.

ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?

నిజానికి గతంలో కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సదుపాయం మార్చి చివరి నాటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. తాజా నివేదికల ప్రకారం, మే 2026 నుండి ఈ యూపీఐ విత్ డ్రా ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: DMart ఏప్రిల్ 4వ వారం మెగా ఆఫర్లు.. 80% వరకు డిస్కౌంట్.. బై వన్ గెట్ వన్ ఫ్రీ డీల్స్‌తో కస్టమర్లకు పండుగ!

UPI ద్వారా ఎంత విత్ డ్రా చేసుకోవచ్చు?

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పీఎఫ్ లబ్ధిదారులు తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు యూపీఐ సిస్టమ్ ద్వారా విత్ డ్రా చేసుకునేందుకు EPFO అనుమతించనుంది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను మెరుగుపరచడం, అకౌంట్ బదిలీలను సులభతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

EPF వడ్డీ రేటు 2025-26

కేంద్ర సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ సభ్యులకు 8.25 శాతం వార్షిక వడ్డీ రేటును సిఫార్సు చేసింది. ఇది ఉద్యోగుల పొదుపుపై మెరుగైన రాబడిని అందించనుంది.

కొత్త సామాజిక భద్రతా పథకాలు – 2026

EPFO తన పాత ఐటీ వ్యవస్థను మార్చి, అత్యాధునిక కేంద్రీకృత వ్యవస్థను (CITES 2.0) తీసుకువస్తోంది. ఇందులో భాగంగా పాత స్కీమ్‌ల స్థానంలో కొత్తవి రాబోతున్నాయి.

  • EPF స్కీమ్, 2026
  • EPS (పెన్షన్) స్కీమ్, 2026
  • EDLI (భీమా) స్కీమ్, 2026

ఈ కొత్త పథకాలు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలను మరింత పటిష్టంగా అమలు చేయడానికి దోహదపడతాయి.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌వో సాధించిన మైలురాళ్లు:

గత ఆర్థిక సంవత్సరంలో EPFO అద్భుతమైన పనితీరును కనబరిచింది:

  • మొత్తం విరాళాలు: రూ.3,35,628.81 కోట్లు.
  • కొత్త సభ్యులు: దాదాపు 1.22 కోట్ల మంది కొత్తగా చేరారు.
  • పెన్షనర్లు: 81.48 లక్షల మందికి పైగా పెన్షనర్లకు సేవలు అందించింది.
  • క్లెయిమ్స్: మొత్తం 6.01 కోట్లకు పైగా క్లెయిమ్‌లను పరిష్కరించింది.

పైలట్ ప్రాజెక్ట్: నిరుపయోగంగా ఉన్న (Inoperative) ఖాతాల్లో రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న వాటిని ఆటోమేటిక్‌గా సెటిల్ చేసేలా మార్చి 2026లో ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా CBT ఆమోదించింది.

ఇది కూడా చదవండి: Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *