Headlines

Vaibhav Sooryavanshi: ఇక్కడ నీ దమ్ము ఏంటో చూపించు.. వైభవ్ సూర్యవంశీకి కివీస్ కోచ్ వార్నింగ్


Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ జట్టు త్వరలో ఒక బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కోబోతుంది. వెస్టిండీస్ సిరీస్ ముగిసిన వెంటనే శ్రేయస్ అయ్యర్, గిల్ సేన న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్, కివీస్ జట్ల మధ్య 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టూర్‌లో పలువురు యంగ్ భారతీయ ఆటగాళ్లు తొలిసారి న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో అదరగొట్టి అతి పిన్న వయసులోనే జాతీయ జట్టులోకి వచ్చిన యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది.

వైభవ్ సూర్యవంశీ ఎదురయ్యే సవాళ్లు

కేవలం 15 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో 776 పరుగులు సాధించి వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. ఈ ప్రదర్శనే అతనికి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేలా చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్ర సిరీస్‌లో పెద్దగా రాణించకపోయినా, జింబాబ్వే టూర్‌లో మాత్రం రెండు హాఫ్ సెంచరీలతో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్, జపాన్ టూర్లలో జట్టులో ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం దక్కించుకోవడంలో కాస్త వెనుకబడ్డాడు. ఇప్పుడు కివీస్ గడ్డపై అత్యంత వేగవంతమైన, బౌన్సీ పిచ్‌లపై అతనికి అసలు సిసలు సవాల్ ఎదురుకానుంది.

కివీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ సంచలన వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని ఏ విధంగా చెలరేగాడో తాము చూశామని, అయితే కివీస్ కండిషన్స్‌లో ఆ దూకుడును ఎలా ప్రదర్శిస్తాడో చూడాలని ఉందని ఆయన పేర్కొన్నాడు. “నేను కోచ్‌గా ఒకటే కోరుకుంటాను.. ఏ ఆటగాడైనా సరే కొంచెం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలని ఉంటుంది. మా వేగవంతమైన, బౌన్సీ పిచ్‌లపై అతన్ని పరీక్షించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని రాబ్ వాల్టర్ కుండబద్దలు కొట్టారు.

సేనా కంట్రీస్‌లో వైభవ్ రికార్డులు

వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఇంగ్లండ్, జింబాబ్వే మినహా ఇతర SENA దేశాలలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే అండర్-19 యూత్ క్రికెట్‌లో మాత్రం విదేశీ గడ్డపై పలుసార్లు తన సత్తా చాటాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఆడిన 4 యూత్ టెస్టుల్లో కలిపి 7 ఇన్నింగ్స్‌లలో 33.33 సగటుతో 223 పరుగులు సాధించాడు. అలాగే యూత్ వన్డేల్లో 11 ఇన్నింగ్స్‌లలో 685 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ అనుభవంతోనే కివీస్ బౌన్సర్లను సమర్థవంతంగా ఎదుర్కొని తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని వైభవ్ సూర్యవంశీ పట్టుదలగా ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *