ఇండస్ట్రీకి వచ్చి 9ఏళ్లు.. వయసు 29.. ఆస్తులు మాత్రం 100కోట్లకు పైగా..

ఇండస్ట్రీకి వచ్చి 9ఏళ్లు.. వయసు 29.. ఆస్తులు మాత్రం 100కోట్లకు పైగా..


ఇండస్ట్రీకి వచ్చి 9ఏళ్లు.. వయసు 29.. ఆస్తులు మాత్రం 100కోట్లకు పైగా..

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా బడా సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. తగ్గట్టుగానే హీరో, హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ కూడా భారీగానే ఉంటున్నాయి. ఇక కొత్త కొత్త భామలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో భారీగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడు చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. సినిమాల్లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ.. అలా అని క్రేజ్ ఏం తక్కువ కాదు.. ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తుంది. 9 ఏళ్ల కెరీర్ లో 100 కోట్ల ఆస్తి సంపాదించింది ఈ అమ్మడు ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మెప్పించింది ఈ భామ. నటనతో పాటు గ్లామర్ పరంగానూ ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటుంది. మొన్నటివరకు బాలీవుడ్ లో సినిమాలు చేసిన ఈ చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగులో భారీ హిట్ అందుకుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది ఈ అమ్మడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పల్లెటూరి యువతిగా కనిపించనుంది జాన్వీ కపూర్. జాన్వీ ఇండస్ట్రీకి వచ్చి 9ఏళ్లు అవుతుంది. కాగా ఈ అమ్మడి ఆస్తిపాస్తులు వంద కోట్లకు పైనే అని తెలుస్తుంది. అలాగే రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటుంది ఈ చిన్నది. దేవర సినిమాకు 5 కోట్లు, పెద్ది కోసం 7 కోట్లు తీసుకుందని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *