Headlines

ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి


తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్, తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను పంచుకున్నారు. వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంచుకోవడంలో తాను చూపిన ధైర్యాన్ని, ముఖ్యంగా ఆపరేషన్ దుర్యోధన సినిమా అనుభవాన్ని వివరించారు శ్రీకాంత్. ఈ సినిమా పెద్ద సాహసమని, ఇది హిట్ కాబట్టి బయటపడ్డానని, లేకపోతే తన ఇమేజ్ పూర్తిగా దెబ్బతినేదని ఆయన తెలిపారు. ఈ విజయంతోనే ఏ పాత్రలోనైనా తనను ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆత్మవిశ్వాసం ఏర్పడిందని శ్రీకాంత్ పేర్కొన్నారు. నటుడిగా, వ్యక్తిగా ఎదురైన సవాళ్లను అధిగమించడంలో మెగాస్టార్ చిరంజీవి తనకెంతగానో తోడ్పడ్డారని శ్రీకాంత్ తెలిపారు. 1999లో సినిమాల అపజయాలతో డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, దాదాపు రెండు మూడు నెలలు ఎవరినీ కలవకుండా ఉన్నానని చెప్పారు.

ఇది కూడా చదవండి : Suman Setty: ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి

బ్రహ్మానందం ద్వారా విషయం తెలుసుకున్న చిరంజీవి, తనను పిలిపించుకొని దాదాపు గంటసేపు క్లాస్ తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు శ్రీకాంత్. హిట్లు, ఫ్లాప్‌లు సహజమని, హీరో కావాలనుకున్న తాను హీరో అయ్యానని, ఇది అదృష్టమని చిరంజీవి గారు నూరిపోసిన ధైర్యం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని శ్రీకాంత్ అన్నారు. ఆ రోజు నుండి విజయాలు, అపజయాలను ఒకే రకంగా చూస్తున్నానని, అది తన జీవితాన్ని ప్రశాంతంగా మార్చిందని ఆయన వివరించారు. చిరంజీవి మాటలు తనకు ఒక ఇంజెక్షన్ లా పనిచేశాయని ఆయన పేర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని, పని పట్ల తనకున్న దృక్పథాన్ని శ్రీకాంత్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి : సౌందర్య కాదు.. వెంకటేష్‌తో ఆరు సినిమాలు.. అన్నీ సూపర్ హిట్లే.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

కాలేజీ రోజుల్లోనూ ఫలితాలను పట్టించుకోకుండా సరదాగా ఉండేవారని, పరీక్షల్లో 35-40 మార్కులు వచ్చినా సంతోషంగా ఉండేవారని తెలిపారు. చదువు విషయంలో తన తమ్ముడు బాగా కష్టపడేవాడని, తాను మాత్రం స్పోర్ట్స్‌పై ఆసక్తి చూపించేవాడినని చెప్పారు. ఎన్.టి. రామారావు, చిరంజీవి గార్ల సినిమాలు చూసి హీరో కావాలనే ఆసక్తితో సినీ పరిశ్రమలోకి వచ్చానని, కానీ ఇక్కడికి వచ్చాక జీవితం ఎలా ఉంటుందో తెలియదని అన్నారు. తన విజయం కేవలం అదృష్టం వల్ల కాదని, వెనుక ఎవరూ లేకుండా డే అండ్ నైట్ కష్టపడి సంపాదించుకున్నదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. కష్టపడితేనే ఫలితం ఉంటుందని, లక్‌పై మాత్రమే ఆధారపడకూడదని ఆయన సూచించారు. తనకు విరోధులు ఎవరూ లేరని, ఒకవేళ ఎవరైనా శత్రువులు ఉన్నా చివరకు వారితో స్నేహం చేస్తానని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని..

Chiranjeevi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *