సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతోనే కాదు వివాదాలతోనూ ఎక్కువగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు రామ్ గోపాల్ వర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన రామ్ గోపాల్ వర్మ.. ఆతర్వాత అలాంటి సినిమాలు తెరకెక్కించలేదు.. ఆయన నుంచి ఓ సాలిడ్ సినిమా కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. శివ లాంటి సినిమాను వర్మ నుంచి కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే గతంలో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఓ గేయ రచయిత గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపై తనదైన శైలిలో స్పందించారు, ఇది అనేకమందిని ఆశ్చర్యపరిచింది.
ఇది కూడా చదవండి : Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది
సాధారణంగా ఏడవటం, బాధపడటం వంటివి చేయని వర్మ, సీతారామశాస్త్రి మరణంపై మాత్రం తన ఆవేదనను, ఆరాధనను వెల్లడించారు. విషాదాన్ని తట్టుకోవడానికి హాస్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మరణాన్ని ఒక మైండ్‌సెట్‌గా చూస్తూ, స్వర్గానికి వెళ్లడం అనేది దుబాయ్ లేదా అమెరికాకు వెళ్లినట్లే అని అన్నారు వర్మ. ఒక వ్యక్తి అమరత్వం అనేది వారు జీవించిన విధానం, సమాజానికి వారు అందించిన సేవపై ఆధారపడి ఉంటుందని వర్మ నమ్ముతారు. సీతారామశాస్త్రి తన అద్భుతమైన సాహిత్యంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను తాకారని, ఆయన లేకపోయినా ఆయన సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ జీవించి ఉంటుందని వర్మ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి :వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్
గత కొన్నేళ్లుగా సిరివెన్నెలతో తనకు వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు లేకపోయినప్పటికీ, తన ఆరాధనను మాత్రం నిస్సందేహంగా వ్యక్తపరిచారు. తాను వ్యక్తిగత బంధాలను అంతగా పట్టించుకోని స్వభావం కలవాడిని కాబట్టే ఈ దూరం ఏర్పడిందని వర్మ వివరించారు. రామ్ గోపాల్ వర్మ, సీతారామశాస్త్రి.. వీరిద్దరూ సమాజంలో మార్పును ఆశించి “కోపంగా” ఉండేవారని వర్మ తెలిపారు. అయితే, తాను ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి, దానిని మార్చడానికి ప్రయత్నించడం కంటే ఆస్వాదించడానికి ఇష్టపడతానని వర్మ వివరించారు. సీతారామశాస్త్రి చివరి క్షణం వరకు “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని” వంటి తన పాటల ద్వారా తన సామాజిక ఆవేదనను వ్యక్తపరుస్తూనే ఉన్నారని వర్మ అన్నారు. ఈ పాటలు సినిమా సన్నివేశాల కోసం కాకుండా, ఆయన మనసులోని భావాలను ప్రతిబింబిస్తాయని, వాటిని తానూ సినిమాల్లో ఉపయోగించుకున్నానని వర్మ వెల్లడించారు.
ఇది కూడా చదవండి :నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.