Inter Admissions 2026: టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్మీడియట్‌ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల.. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం

Inter Admissions 2026: టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్మీడియట్‌ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల.. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం


హైదరాబాద్‌, మే 5: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలు మే 8 నుంచి మొదలుకానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు మే 31, 2026వ తేదీ వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇక జూన్‌ 1 నుంచి ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌తోపాటు సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకు కూడా తరగతులు ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్ తొలివిడత ప్రవేశాలు జూన్‌ 30వ తేదీతో ముగుస్తాయని తెలిపారు.

ఇంటర్ ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు తప్పనిసరిగా తమ ఆధార్‌కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్‌ కాలేజీలు ప్రవేశాల సమయంలో ప్రవేశ ద్వారం వద్ద మొత్తం ఎన్ని సెక్షన్లు, ఎన్ని సీట్లు ఉన్నాయో వీటి వివరాలను నోటీస్ బోర్డులో వెల్లడించవల్సి ఉంటుంది. మొత్తం సీట్లలో ఎన్ని భర్తీ అయ్యాయో, ఇంకెన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో అందరికీ కనిపించేలా నోటీస్‌ బోర్డుపై ప్రదర్శించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్ సహా అన్ని రకాల జూనియర్ కాలేజీల్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అడ్మిషన్ల ప్రక్రియలో రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రవేవాల సమయంలో ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని హెచ్చరించారు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించాలని, నిబంధనలు అతిక్రమిస్తే సదరు కాలేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ కాలేజీలు ఒక్కో సెక్షన్‌కు కేవలం 88 మందిని మాత్రమే చేర్చుకోవాలని, అదనంగా విద్యార్థులను చేర్చుకుంటే గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రవేశాల సమయంలో విద్యార్ధుల నుంచి తప్పనిసరిగా యాంటీ డ్రగ్‌ అఫిడవిట్‌ తీసుకోవాలని కాలేజీ యాజమన్యాలను

ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్‌ ఇదే..

  • ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ మొదటి విడత ప్రవేశాలు ప్రారంభ తేదీ: మే 8, 2026.
  • దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: మే 31, 2026.
  • ఇంటర్‌ తరగతులు ప్రారంభ తేదీ: జూన్ 1, 2026 నుంచి
  • మొదటి విడత ప్రవేశాల ముగింపు తేదీ: జూన్ 30, 2026.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *