Headlines

అమ్మతనమే కాదు.. నాన్నతనమూ అద్భుతమే! ’డాడ్ బ్రెయిన్‘లోనూ ఛేంజెస్ వస్తాయా?

అమ్మతనమే కాదు.. నాన్నతనమూ అద్భుతమే! ’డాడ్ బ్రెయిన్‘లోనూ ఛేంజెస్ వస్తాయా?


అమ్మతనమే కాదు.. నాన్నతనమూ అద్భుతమే! ’డాడ్ బ్రెయిన్‘లోనూ ఛేంజెస్ వస్తాయా?

భార్య గర్భం దాల్చిందన్న కబురు విన్న వెంటనే మగాడిలో అప్పటివరకు ఉన్న అలవాట్లు మారిపోతాయి. మునుపటి కంటే మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలను పక్కనపెట్టి, భార్య మరియు పుట్టబోయే బిడ్డ పట్ల అమితమైన ప్రేమను ప్రదర్శిస్తారు. ‘డాడ్ బ్రెయిన్’ అనే పుస్తక రచయిత ప్రకారం, తొలిసారి తండ్రులు కాబోయే మగాళ్ల మెదళ్లలో నాడీ సంబంధిత మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త అనుభవాలకు అనుగుణంగా మెదడు తనను తాను సిద్ధం చేసుకుంటుంది.

హార్మోన్ల పాత్ర

మన మెదడులో తల్లిదండ్రులుగా వ్యవహరించే తీరును నియంత్రించే భాగాన్ని ‘ఆలోపేరంటల్ సబ్ స్ట్రేట్’ అంటారు. బిడ్డ పుట్టబోతున్నాడన్న వార్తతోనే ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ సమయంలో పురుషుల్లో టెస్టోస్టిరాన్, వాసోప్రిన్ వంటి హార్మోన్లలో కీలక మార్పులు వస్తాయి.

  • టెస్టోస్టిరాన్ తగ్గింపు : సాధారణంగా పురుషుల్లో ఉండే దూకుడుకు కారణమైన టెస్టోస్టిరాన్ స్థాయి, తండ్రి కాబోయే వారిలో తగ్గుతుంది. దీనివల్ల వారిలో ప్రశాంతత పెరిగి, బిడ్డతో త్వరగా మమేకం అయ్యేలా చేస్తుంది.
  • ఆక్సిటోసిన్ పెరుగుదల : దీనినే ‘ప్రేమ హార్మోన్’ అంటారు. బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు, వారితో ఆడుకుంటున్నప్పుడు తండ్రులలో ఆక్సిటోసిన్ వెల్లువలా ఉత్పత్తి అవుతుంది. ఇది తండ్రి-బిడ్డల మధ్య అనుబంధాన్ని బలపరుస్తుంది.

    Fatherhood1

    Fatherhood1

ఆశ్చర్యపరిచే ప్రోలాక్టిన్ రహస్యం

సాధారణంగా బాలింత తల్లులలో చనుబాల ఉత్పత్తికి ‘ప్రోలాక్టిన్’ అనే రసాయనం కారణమవుతుంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తమ బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురుచూసే తండ్రులలో కూడా ఈ హార్మోన్ స్థాయి ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. బిడ్డ సంరక్షణలో తండ్రి ఎంత ఎక్కువగా పాలు పంచుకుంటే, వారిలో ఈ మార్పులు అంత స్పష్టంగా కనిపిస్తాయి.

ముఖ్యంగా ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు వయసున్న పిల్లల తండ్రుల్లో ఆక్సిటోసిన్ స్థాయిలు గరిష్టంగా ఉంటున్నాయని యూఎస్ వర్సిటీ అధ్యయనాలు వెల్లడించాయి. తండ్రి కావడం అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది పురుషుడి మెదడును, మనసును మార్చే ఒక గొప్ప జీవసంబంధమైన ప్రక్రియ. అందుకే అమ్మతనం ఎంత గొప్పదో, నాన్నతనం కూడా అంతే అద్భుతం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *