Headlines

Weekly Career Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..మీ రాశికి ఎలా ఉందంటే..?


కెరీర్ వారఫలాలు (సెప్టెంబర్ 27 – అక్టోబర్ 3, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు పనిభారం పెరిగినా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వృషభ రాశి వారికి ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తులో కెరీర్‌కు ఉపయోగపడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి కెరీర్ పరంగా వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

  1. మేషం: ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. పనిభారం పెరిగినా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
  2. వృషభం: ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఆశించిన ఫలితాలు దక్కుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయానికి ఇబ్బంది ఉండదు. వ్యాపారాలు క్రమంగా లాభాల బాట పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది.
  3. మిథునం: ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా చక్కదిద్దగలుగుతారు. అదనపు ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తులో కెరీర్‌కు ఉపయోగపడతాయి.
  4. కర్కాటకం: ఉద్యోగ, వృత్తి రంగాల్లో పని భారం పెరుగుతుంది. అయితే వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి శుభవార్త అందే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. బాధ్యతలను క్రమపద్ధతిలో నిర్వహించడం అవసరం.
  5. ఇవి కూడా చదవండి



  6. సింహం: కెరీర్ పరంగా కీలకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. కొత్త ఆలోచనలను వృత్తి, వ్యాపారాల్లో అమలు చేసి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగ మార్పుకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు రావచ్చు.
  7. కన్య: ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా అందుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన వస్తుంది. పెండింగ్‌లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిభకు, మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది.
  8. తుల: ఉద్యోగులకు బాధ్యతలు గణనీయంగా పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరికలేని పరిస్థితి ఏర్పడినా ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఆశించిన స్పందన లభిస్తుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
  9. వృశ్చికం: ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. పదోన్నతికి సంబంధించిన అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో మిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది.
  10. ధనుస్సు: కెరీర్, ఆదాయ పరంగా వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాల్లో మీ నిర్ణయాలు, వ్యూహాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
  11. మకరం: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినా కెరీర్ పరంగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. మొండి బాకీల వసూలులో పురోగతి ఉంటుంది.
  12. కుంభం: కెరీర్ పరంగా వారం మిశ్రమంగా ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు.
  13. మీనం: కెరీర్ పరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొత్త నిర్ణయాలను అమలు చేయడం వల్ల వృత్తిపరంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *