ఆనాటి బాల్యం మరింత మధురం! చేతుల్లో వీడియో గేమ్‌లు, కళ్లకు అద్దాలు లేవు; పచ్చని మట్టినేలే ఆటస్థలాలు, చెట్టు కొమ్మలే ఉయ్యాలలు. గోళీలు, బొంగరాలు, టైరు చక్రాల ఆటలతో సంధ్యా సమయం వరకు వీధుల్లో కేరింతలు కొట్టేవారు. రాత్రిపూట ఆరుబయట నులక మంచాలు వేసుకుని, కరెంట్ లేకపోయినా చల్లటి వెన్నెల్లో నక్షత్రాల జాతర చూస్తూ.. రేడియోలో పాత పాటలు, క్రికెట్ కామెంట్రీ వింటూ అమ్మమ్మలు చెప్పే చందమామ కథలు వింటూ నిద్రపోయే ఆ రాత్రులు ఎంత ప్రశాంతమైనవి!