Headlines

Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఓ వైపు ఎండలు.. మరో వైపు వర్షాలు కురుస్తున్నాయి.. అయితే.. తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల పురోగమనం తోపాటు అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. 2026 మే 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.

నిన్నటి నైరుతి – దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు , 2026 మే 13వ తేదీన, భారత కాలమానం ప్రకారం ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతున్నది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతోపాటు ఉత్తర-దక్షిణ ద్రోణి నైరుతి మధ్యప్రదేశ్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ అంతర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :-

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30-40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

రాయలసీమ :-

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30-40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఈనెల 16 వ తారీఖు నాటికీ నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం, ఉపరితల చక్రవాత ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

బుధవారం, గుువారం, శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని ఒకటి రెండు తూర్పు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కిమీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నుండి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *