Weather: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

Weather: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్


తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా్యి. ద్రోణి,  ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ, అంతర కర్ణాటక – తమిళనాడు మీదుగా తూర్పు విదర్భ నుండి కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న నిన్నటి  ద్రోణి / గాలుల అంతరాయం ఈ రోజు  సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర తమిళనాడు – పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు  తమిళనాడు తీర ప్రాంతముపై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగ గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :-

గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే  అవకాశం ఉంది.

దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్ :-

గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-

గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు  చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా జల్లులు ఒకటి లేదా రెండు  చోట్ల కురిసే అవకాశముంది.

శనివారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 –  44 డిగ్రీలు సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. నిన్న  మరాత్వాడ ప్రాంతం నుండి  కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు తూర్పు విదర్భ నుండి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు  సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. నిన్న అంతర్గత మహారాష్ట్ర – సమీపంలోని తెలంగాణ ప్రాంతంలో కొనసాగిన యాంటీ సైక్లోనిక్ సర్కులేషన్ ఈరోజు తెలంగాణ ప్రాంతానికి దూరంగా కదిలిపోయింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన:

తెలంగాణ రాష్ట్రంలో గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు  ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు – గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *