Headlines

Wealth Astrology: డిసెంబర్ నెలంతా వీరికి సంపద..! ధనవంతులు కాబోయే రాశులివే..


December 2026 Wealth Astrology: డిసెంబర్ నెలలో రాహుకేతువులు మకర, కర్కాటక రాశుల్లో, 16 తర్వాత రవి ధనూ రాశిలో, 3 నుంచి 22 వరకు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. రవి ధనూ రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల కొన్ని రాశులకు రాజయోగాలు కలిగే అవకాశం ఉంది. రాహుకేతువులు, రవి, బుధుల మార్పు వల్ల ఈ రాశులకు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. బుధుడి వల్ల ఆదాయ వృద్ది, రవి వల్ల ఉద్యోగాలు, గౌరవమర్యాదలు, వివాదాల పరిష్కారం వంటి అంశాలలో శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే సూచనలున్నాయి. డిసెంబర్ నెలంతా మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులు విశేషంగా ప్రయోజనాలు పొందడం జరుగుతుంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానంలో, ఈ నెల ద్వితీయార్థం నుంచి రవి ధనూ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం, ఆకస్మిక ధన లాభం కలగడం, వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదురుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి స్థిరత్వం లభిస్తుంది. పిత్రార్జితం లభిస్తుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి రవి, బుధులు ఇప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యో గంలో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్ప కుండా భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి కలుగుతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఇతర దేశాల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి.
  3. సింహం: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో రాశ్యధిపతి రవి సంచారం వల్ల ఉద్యోగంలో ప్రతిభకు, సమ ర్థతకు గుర్తింపు లభించడం, హోదా పెరగడం, అదనపు పని భారం నుంచి ఉపశమనం లభిం చడం వంటివి జరుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఫేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచ నాలకు మించిన లాభాలు కలుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కష్టనష్టాలు తగ్గిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడు తులా రాశిలోనే సంచారం చేయడం, ధన స్థానంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మహా భాగ్య యోగాలు, రాజయోగాలు కలు గుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి



  6. ధనుస్సు: ఈ రాశిలో భాగ్య స్థానాధిపతి రవి, లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల, ధన సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా పరిష్కా రమయ్యే అవకాశం ఉంది. జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇంట్లో శుభకార్యాలు జరు గుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అవడం జరుగుతుంది.
  7. కుంభం: ఈ రాశికి రవి, బుధ, శుక్రులతో పాటు గురువు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల డిసెంబర్ నెలంతా ఈ రాశివారికి విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. విపరీత రాజయోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *