Headlines

Watch: కింద చూస్తే 3500 అడుగుల లోయ.. పైకి చూస్తే ఆకాశం.. గంటపాటు గాలిలో నరకయాతన!

Watch: కింద చూస్తే 3500 అడుగుల లోయ.. పైకి చూస్తే ఆకాశం.. గంటపాటు గాలిలో నరకయాతన!


మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్ తోరణ్‌మాళ్‌లో ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. సీతాఖాయ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన జిప్‌లైన్‌పై ఓ పర్యాటకుడు గాల్లోనే చిక్కుకుపోయాడు. సుమారు 3,500 అడుగుల లోతైన లోయపై జిప్‌లైన్ ఆగిపోవడంతో అతడు దాదాపు గంటపాటు భయంతో విలవిలలాడాడు.

సాహస వినోదంలో భాగంగా జిప్‌లైన్ ఎక్కిన పర్యాటకుడు మధ్యలోనే నిలిచిపోయాడు. కింద భారీ లోయ కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటనను గమనించిన అక్కడి పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే జిప్‌లైన్ నిర్వహణ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జిప్‌లైన్ నిర్వాహక బృందం వెంటనే రంగంలోకి దిగింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు చేపట్టి, తీవ్రంగా శ్రమించి, గాల్లో చిక్కుకున్న పర్యాటకుడిని సురక్షితంగా నేలపైకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో పర్యాటకుడికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే నిర్వాహక బృందం వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సాహస క్రీడల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు మరింత కఠినంగా పాటించాలని పర్యాటకులు కోరుతున్నారు. తోరణ్‌మాళ్ హిల్ స్టేషన్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందడంతో ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *