Headlines

Vrushakarma Trailer: 5 వేల ఏళ్ల నాటి రహస్యం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్


యువ సామ్రాట్ నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా వస్తున్న వృషకర్మ ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై BVSN ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచింది. ఏకంగా 5000 సంవత్సరాల క్రితం నాటి ఒక పురాతన అతీంద్రియ రహస్యాన్ని పరిచయం చేస్తూ కథ మొదలవుతుంది. మొదట సాధారణ ట్రెజర్ హంటర్‌గా కనిపించే నాగచైతన్య ప్రయాణం, ఆ తర్వాత మానవాళికి ముప్పు కలిగించే భయంకరమైన రహస్యం చుట్టూ తిరుగుతుంది. మనిషి ఆలోచనలకు అందని వేద విజ్ఞానం, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. సృష్టి ధర్మాన్ని కాపాడే దైవిక శక్తిగా నాగచైతన్య మారడం ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది. రఫ్ అండ్ ఇంటెన్సివ్ లుక్‌లో నాగచైతన్య నటన, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్లు మీనాక్షి చౌదరి, కియారా ఖన్నా, సీనియర్ నటుడు జయరాం, విలన్ స్పర్శ్ శ్రీవాత్సవ్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 4న ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kaithi: కార్తి రిక్వెస్ట్ చేయడంతో.. హిట్టు సినిమా వదులుకున్న సేతుపతి

పాకిస్థాన్‌ సిరీస్‌ ఇష్యూ..నెట్‌ఫ్లిక్స్‌కు భారత సినీ కార్మికుల హెచ్చరిక

అలియాస్ రుక్మిణీ ట్రైలర్.. నితిన్‌ను గట్టెక్కిస్తుందా..?

బంగారం కొంటున్నారా.. కక్కుర్తితో అలా చేస్తే మీ కొంప కొల్లేరే..!

ధురంధర్ బ్యూటీకి ఇన్నాళ్లకు మంచి ఆఫర్ వచ్చిందా..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *