Headlines

Viral Video: ఎవరు బ్రో నువ్వు ఇంత స్పీడున్నావ్.. మెరుపు వేగంతో పాటును పట్టుకున్నాడు.. కట్‌చేస్తే..


ఎంతటి పర్‌ఫెక్ట్‌ స్నేక్ క్యాచర్ అయినా.. నాగుపామును పట్టుకోవాలంటే కాస్త తడబడతారు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించాడు. రెప్పపాటులో గుంతలో దాక్కున్న పామును పట్టేశాడు. అది కూడా ఒక్క చేతితో.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనాలు అతని ధైర్యసాహసాలను తెగ మెచ్చుకుంటున్నారు.

వైరల్ వీడియో ప్రకారం.. గ్రామ సమీపం నుంచి వెళ్తున్న కొందరి స్థానికులకు రోడ్డు పక్కనున్న ఓ వెదురు రంధ్రంలో ఏదో కదులుతున్నట్టు కనిపించింది. ఏంటని దగ్గరికి వెళ్లగా అందులో ఓ భారీ నాగుపాము కంటపడింది. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకడంతో నిమిషాల్లో పామును చూసేందుకు భారీగా జనం వచ్చేశారు. దాని చుట్టూ అందరూ గుమిగూడారు. వాళ్లను గమనించిన పాము తన పడగను బయటికి విప్పి వాళ్లపై కోపంగా చూడడం స్టార్ట్ చేసింది.

అయితే ఇంతలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఏమాత్రం భయపడకుండా.. మెరుపు వేగంతో ఆ పాము తలను పట్టేశాడు. అది కూడా ఒక చేత్తో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తూ.. మరో చేత్తో పామును పట్టుకున్నాడు. నార్మల్‌గా స్నేక్ క్యాచర్స్‌ పాము దృష్టిని మరల్చి, బ్యాక్ సైడ్ నుంచి లేదా కర్ర సహాయంతో వాటిని బంధిస్తారు. కానీ ఇక్కడ ఆ యువకుడు మాత్రం అవేవీ లేకుండా ధైర్యంగా ఆ పామును పట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను @zilanimullah అనే అకౌంట్ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..

సోషల్‌ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. “వామ్మో! మనోడు మెరుపు కంటే వేగంగా ఉన్నాడే” అని ఓ యూజర్ కామెంట్‌ చేయగా.. “అవి విషసర్పాలు, వాటితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనకే మంచిది” అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. “ఏమాత్రం తేడా జరిగినా ప్రాణాలు గాల్లోనే” అని మరో యూజర్ కామెంట్ చేయగా.. “దీన్ని చావు నోట్లో తలపెట్టడం అంటారు” అని ఇంకో యూజర్ ఫన్నీగా కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *