Headlines

మీరు పైకి చూస్తే మేం కిందకు చూస్తాం.. 20వ అంతస్థులో సరదా కష్టాలు


20వ అంతస్తులో ఉంటే పూర్తి నిశ్శబ్దం ఉంటుందని అనుకోవడానికి లేదు. చిన్న చిన్న శబ్దాలు కూడా చాలా స్పష్టంగా పై వరకు వినిపిస్తాయని సాక్షి శర్మ సరదాగా చెప్పారు. 20వ అంతస్తులో నివసించడం ఎంత విచిత్రంగా ఉంటుందో మనకు ఎవరూ ముందుగా చెప్పరు. ముఖ్యంగా ఎక్కువ ఎత్తులో ఉంటే పిన్-డ్రాప్ సైలెన్స్ ఉంటుందని అనుకుంటాం కానీ ఇక్కడ .. కింద పడే ప్రతి చిన్న పిన్ శబ్దం కూడా మాకు వినిపిస్తుంది అని శర్మ అన్నారు.

బాణాసంచా కాల్చడం లాంటి సాధారణ విషయం కూడా అంత ఎత్తు నుంచి చూస్తే ఎంత విభిన్నంగా అనిపిస్తుందో ఆమె చెప్పారు. “రాకెట్ లేదా బాణసంచా పేలి శబ్దం వచ్చినప్పుడు, మీరు సాధారణంగా పైకి చూస్తారు కదా? కానీ మేం మాత్రం కిందకి చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు హెలికాప్టర్లు కూడా మా కంటి చూపు ఎత్తులోనే ప్రయాణిస్తుంటాయి” అని ఆమె తెలిపారు.

ఈ విచిత్ర దృశ్యాలన్నీ పక్కన పెడితే, ఎత్తైన భవనాల్లో నివసించే వారికి అసలైన భయం లిఫ్ట్‌ల గురించేనని అన్నారు. 20వ అంతస్తులో ఉండే వారికి రెండు లిఫ్ట్‌లు ఒకేసారి ఆగిపోతాయనే ఆలోచనే ఒకింత భయపెడుతుందనీ, పైకి వెళ్లే ఒక సాధారణ ప్రయాణం కాస్తా, వందలాది మెట్లు ఎక్కాల్సిన సుదీర్ఘ నడకగా మారుతుందనీ చెప్పారు.  ” మాకు అసలైన పీడకల ఏంటో తెలుసా? రెండు లిఫ్ట్‌లు పనిచేయడం మానేస్తే పరిస్థితి ఏంటనేదే?” అని ఆమె పేర్కొన్నారు.  ఇక సీరియస్ అంశం నుంచి పక్కకు జరిగి ఒక జోక్  కూడా చెప్పారామె. తమతో సమానమైన ఎత్తులో మనుషులు నివసించడం చూసి పక్షులు కూడా ఆశ్చర్యపోతున్నట్లుగా ఉంటాయని సరదాగా వ్యాఖ్యానించారు.  ” పక్షులు కూడా మా వైపు విచిత్రంగా చూస్తాయి. ‘ఏంటి మనుషులారా, మీరిక్కడ ఏం చేస్తున్నారు?’ అన్నట్లుగా చూస్తాయి” అన్నారు.

ఈ వీడియో సోషల్ మీడియా యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా మంది ఆమె పరిశీలనలను తమ జీవితానికి సరిపోయేలా, ఎంతో సరదాగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.  “వర్షం పడకముందే, అది మన వైపు ఎలా వస్తుందో ముందుగానే చూడగలగడం ఆశ్చర్యం కలిగించే అంశం!” అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు.  “అది నా కల, ఎప్పటికైనా నేను ఆ అనుభూతిని పొందాలని కోరుకుంటున్నాను,” అని మరొకరు కామెంట్ చేశారు. అంత ఎత్తులో ప్రకృతిని ఆస్వాదించడం జీవితంలో ఒక ప్రత్యేక అనుభూతి అని ఇంకొకరు అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *