Headlines

Vijay Thalapathy : 400 మందికి పైగా సినిమా సిబ్బందికి బంగారు ఉంగరాలు.. విజయ్ మనసు బంగారం..

Vijay Thalapathy : 400 మందికి పైగా సినిమా సిబ్బందికి బంగారు ఉంగరాలు.. విజయ్ మనసు బంగారం..


కోలీవుడ్ స్టార్ హీరో.. నిన్నటి వరకు దళపతి విజయ్.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్.. ఆదివారం తమిళనాడు 22వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. చిత్ర పరిశ్రమలో రాణించిన ఈ నటుడు ఇప్పుడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ అధికార పగ్గాలు చేపట్టారు. విజయ్ పేద మహిళల పెళ్లికి 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం ఇస్తానని వాగ్దానం చేశారు. ఆయన ఈ ప్రకటనలను తన పార్టీ మేనిఫెస్టోలో చేశారు. కానీ, ఎలాంటి ప్రకటన లేకుండా విజయ్ బంగారం ఇవ్వడం వెనుక ఉన్న కథ మీకు తెలుసా? 2026 తమిళనాడు ఎన్నికలలో విజయ్ టీవీకే పార్టీ భారీ ప్రభావాన్ని చూపింది. పార్టీ ఏర్పడిన కొద్ది సంవత్సరాలలోనే ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకోవడం రాజకీయ రంగంలో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పరిణామం భారతదేశంలోనే కాకుండా పొరుగు దేశాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. చాలామంది విజయ్‌ను ‘తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి’ అని పిలవడం ప్రారంభించారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఇదిలా ఉంటే.. ‘బిగిల్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన తరుణంలో, విజయ్ చిత్ర యూనిట్‌లోని సుమారు 400 మంది సభ్యులకు బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఇందులో లైట్ మెన్, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర కింది స్థాయి టెక్నీషియన్లు కూడా ఉన్నారు. ప్రతి ఉంగరంపై ‘Bigil’ అని ఇంగ్లీష్‌ అక్షరాలు చెక్కి ఉండటం విశేషం. షూటింగ్ చివరి రోజున విజయ్ స్వయంగా ప్రతి ఒక్కరినీ పిలిచి, వారి పనిని అభినందిస్తూ ఈ రింగులను అందించారు. ఈ విషయాన్ని ‘బిగిల్’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత్రి అర్చన కల్పతి సైతం ట్వీట్ చేశారు. ‘ బిగిల్ ‘ చిత్రంలో ప్రతిరోజూ 400 మంది సభ్యుల బృందం పనిచేసిందని.. ప్రతి ఒక్కరి కృషికి విలువనిచ్చి మా తలపతి ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారని రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

సినిమాలో నటించిన నటీమణులు వర్షా బొల్లమ్మ, గాయత్రీ రెడ్డి వంటి వారు తమకు అందిన గోల్డ్ రింగ్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, విజయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం నటీనటులకే కాకుండా, సెట్‌లో కష్టపడే ప్రతి ఒక్కరినీ గుర్తించి గౌరవించడం విజయ్ గొప్పతనానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధి అర్చన కల్పతి స్పందిస్తూ.. “షూటింగ్ చివరి రోజును మా దళపతి మరింత స్పెషల్ చేశారు. ప్రతి ఒక్కరి శ్రమను గుర్తించి, ఆయన చూపించిన ఈ ప్రేమ చిత్ర బృందానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది” అని ట్వీట్ చేశారు. ఈ సినిమా సుమారు 180 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైంది.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *