Headlines

Vijay Devarakonda: మాస్ కమ్‌బ్యాక్ కోసం రౌడీ మాస్టర్ ప్లాన్..

Vijay Devarakonda: మాస్ కమ్‌బ్యాక్ కోసం రౌడీ మాస్టర్ ప్లాన్..


కమ్‌బ్యాక్ ఇస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోవాలి.. విమర్శించిన వాళ్లే వారెవ్వా అనాలి.. కాస్త లేటైనా అదే జరుగుతుందంటున్నారు విజయ్ దేవరకొండ. రౌడీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఒకేసారి మూడు మాసివ్ సినిమాలతో దండయాత్రకు సిద్ధమవుతున్నారీయన. మరి విజయ్ నమ్మకానికి అసలు కారణమేంటి.. కమ్‌బ్యాక్ కోసం ఏం జరుగుతుంది..? హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా విజయ్ దేవరకొండకు ఓ మార్కెట్ ఉంది.. ఆయనకు తగ్గ సినిమా పడ్డ రోజు బాక్సాఫీస్ షేక్ అవుతుందనడంలో అనుమానం అవసరం లేదు. లైగర్, కింగ్డమ్ ఫ్లాపైనా.. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తాజాగా రౌడీ జనార్ధనతో పాటు రాహుల్ సంక్రీత్యన్‌ రణబాలి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు రౌడీ బాయ్. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్ధన షూటింగ్ 30 శాతం పూర్తైంది. 2026 డిసెంబర్‌లో రానుంది.. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక రాహుల్ తెరకెక్కిస్తున్న రణబాలి సెప్టెంబర్ 11నే విడుదల కానుంది. 1854 నుంచి 1878 మధ్యలో ఉండే వారియర్ స్టోరీ ఇది.. ఇప్పటికే షూటింగ్ 70 శాతం పూర్తైంది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. టాక్సీవాలా తర్వాత విజయ్, రాహుల్ కలిసి చేస్తున్న రెండో సినిమా రణబాలి. మైత్రి మూవీ మేకర్స్ 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా రౌడీ జనార్ధన, రణబాలి అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్. వీటి తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రౌడీ బాయ్. వీటితో మాస్ కమ్ బ్యాక్ ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: గుడ్ న్యూస్‌.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్‌ప్రైజ్‌ | పెద్ది కోసం రంగంలోకి ధోని

అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా

Siri Hanumanth: ఇన్‌స్టా సబ్‌ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!

Peddi: బాబాయ్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్

Trisha: విజయ్‌ మౌనం నాకు నచ్చదు..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *