Video: బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు వెళ్లిన బుడ్డోడు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే..?

Video: బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు వెళ్లిన బుడ్డోడు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే..?


Virat Kohli autograph viral video: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఆయన బస చేసిన హోటల్ వద్ద కోహ్లీని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ సమయంలో ఒక బాలుడు తన బ్యాటుపై కోహ్లీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూశాడు. కోహ్లీ హోటల్‌లోకి ప్రవేశిస్తుండగా, ఆ బాలుడు పరుగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆ బాలుడిని అడ్డుకోవడంతో కోహ్లీని కలవడం సాధ్యపడలేదు.

నిరాశతో చిన్నారి కన్నీళ్లు.. వైరల్ వీడియో

తన అభిమాన ఆటగాడి సంతకం దక్కకపోవడంతో ఆ బాలుడు తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఎంతో ఆశగా తెచ్చుకున్న బ్యాటుపై ఆటోగ్రాఫ్ దొరకలేదన్న బాధతో అక్కడికక్కడే ఏడవడం మొదలుపెట్టాడు. ఆ కోపంలో తన చేతిలో ఉన్న బ్యాటును నేలకేసి విసిరేసి, వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ హృదయ విదారక దృశ్యాన్ని ఎవరో సెల్ ఫోన్ లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు “పాపం ఆ చిన్నారికి కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇప్పించాల్సింది” అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ గడ్డపై కోహ్లీ విశ్వరూపం..

మరోవైపు సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన బ్యాటుతో శివతాండవం చేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా టి.నటరాజన్ వేసిన ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి, ఆర్సీబీని సునాయాసంగా గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు రెండో స్థానానికి ఎగబాకింది. ఒకవైపు మైదానంలో పరుగుల వరద పారించినా, బయట తన కోసం ఆరాటపడ్డ ఆ చిన్నారిని కోహ్లీ పలకరించలేకపోవడం అభిమానులను చిన్నపాటి నిరాశకు గురిచేసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *