Headlines

Vaibhav Sooryavanshi : 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో విధ్వంసం.. జింబాబ్వే టూర్లో వైభవ్ బ్రేక్ చేసిన 5 రికార్డులివే

Vaibhav Sooryavanshi : 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో విధ్వంసం.. జింబాబ్వే టూర్లో వైభవ్ బ్రేక్ చేసిన 5 రికార్డులివే


Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ రంగానికి మరొక అద్భుతమైన యంగ్ టాలెంట్ దొరికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరిగిన టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 196.10 భారీ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 151 పరుగులు చేసి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకోవడమే కాకుండా, భారత్ 3-0 తేడాతో జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఈ పర్యటనలో అతను తిరగరాసిన 5 చారిత్రాత్మక రికార్డులు క్రికెట్ చరిత్రలో నిలిచిపోనున్నాయి.

1. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన హాఫ్ సెంచరీ హీరో

జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీనితో ప్రపంచ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచి, గతంలో నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

2. సచిన్ టెండూల్కర్ 37 ఏళ్ల నాటి భారత రికార్డు బ్రేక్

భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. దాదాపు 37 సంవత్సరాలుగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ హాఫ్ సెంచరీ రికార్డును వైభవ్ దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

3. 16 ఏళ్ల వయస్సు రాకముందే రెండు T20I హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్

సిరీస్‌లోని మూడో టీ20 మ్యాచ్‌లో 49 బంతుల్లో 81 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడం ద్వారా, పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 16 ఏళ్ల వయసు నిండక ముందే రెండు హాఫ్ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే మొదటి ప్లేయర్‌గా మైలురాయిని చేరుకున్నాడు.

4. ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల్లో అరుదైన కీర్తి

ఐసీసీ పూర్తి సభ్యత్వం ఉన్న ప్రధాన క్రికెట్ దేశాల తరఫున ఆడుతూ, 16 ఏళ్ల వయసు కంటే ముందే అంతర్జాతీయ స్థాయిలో ఒకటి కంటే ఎక్కువ (రెండు) హాఫ్ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా వైభవ్ రికార్డుల్లోకెక్కాడు.

5. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్

ఈ సిరీస్‌లోని 3 మ్యాచుల్లో 196.10 స్ట్రైక్ రేట్‌తో అత్యధికంగా 151 పరుగులు చేసి భారత్ 3-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గానూ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్న యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *