Headlines

Venu Madhav : వేణుమాధవ్ తొలి మిమిక్రీ వాయిస్ ఎవరిదో తెలుసా..? ఆసక్తికరమైన కథ చెప్పిన కమెడియన్..


తెలుగు సినీ హాస్యరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు, కమెడియన్, మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్. మిమిక్రీతో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత వెండితెరపై ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో వేణుమాధవ్ పంచుకున్న తన జీవితంలోని ఆరంభ రోజులు, తొలి మిమిక్రీ అనుభవాలు, దివంగత నేత ఎన్టీ రామారావు వద్ద పనిచేసిన జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాను తొలిసారి మిమిక్రీ చేసిన వాయిస్ ఎవరిదో చెబుతూ, అది ఎన్టీ రామారావుగారి వాయిస్ అని వేణుమాధవ్ గుర్తుచేసుకున్నా. నల్గొండ జిల్లా కోదాడలో పుట్టి పెరిగిన ఆయన, అక్కడ మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆ ప్రతిభను గమనించిన అప్పటి కోదాడ ఎమ్మెల్యే చంద్రరావుగారు భువనగిరిలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయించారు. అక్కడ హోంమంత్రి మాధవరెడ్డిగారు, నారా చంద్రబాబు నాయుడుగారు ఆ ప్రోగ్రామ్ చూసి, మహానాడు వేదికపై ప్రదర్శన ఇవ్వమని ప్రోత్సహించారు. లక్షలాది మంది సమక్షంలో ఎన్టీఆర్ ముందు ప్రదర్శన ఇచ్చిన తర్వాత, తమ ఆఫీసులో పనిచేసే అవకాశం కల్పించారని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna : తొలి సినిమాకే రికార్డు.. 1965లో సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే..

హిమాయత్‌నగర్ ఆఫీసులో ఆపరేటర్‌గా చేరిన రోజుల్లో ఎదురైన సరదా సంఘటనలను వేణుమాధవ్ పంచుకున్నారు. అప్పట్లో సెల్‌ఫోన్లు లేకపోవడంతో, మిమిక్రీ ప్రోగ్రామ్‌ల కోసం విసిటింగ్ కార్డుపై ఆఫీస్ నంబర్ వేయించుకోవడం, వరుస ఫోన్ కాల్స్ రావడంతో కలిగిన గందరగోళాన్ని ఆయన సరదాగా వివరించారు. అలాగే ఎన్టీఆర్ ఇంట్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఉదయం ప్రెస్ మీట్ హడావుడిలో బయట బల్బు స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయిన ఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ చిన్న పొరపాటు కారణంగా జరిగిన సంఘటన, ఆ తర్వాత దోశ తినిపించి ఆప్యాయంగా పలకరించిన తీరును ఆయన ఆసక్తిగా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : నా భార్య ఎప్పుడూ నా పక్కన నడవదు.. కారణం చెప్పిన జగపతి బాబు..

ఒక చిన్న లైట్ స్విచ్ ఆన్, ఆఫ్ తన జీవితంలో మరచిపోలేని అనుభూతిని మిగిల్చిందని వేణుమాధవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘సంప్రదాయం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన వేణు మాధవ్, ‘మాస్టర్’ సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ‘తొలిప్రేమ’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘సింహాద్రి’, ‘లక్ష్మి’, ‘దిల్’, ‘ఆర్య’, ‘హంగామా’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. మాడ్యులేషన్, పంచ్ డైలాగులతో ఆయన చేసిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. పలు చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు, డైలాగులు నేటికీ సోషల్ మీడియాలో, మీమ్స్‌లో వైరల్ అవుతుంటాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవల ఆధారంగా వచ్చిన సినిమా.. శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *