Headlines

TVK Vijay- Trisha: విజయ్‌లో నాకు నచ్చని లక్షణం అదే.. టీవీకే చీఫ్ సీక్రెట్స్ బయటపెట్టిన త్రిష

TVK Vijay- Trisha: విజయ్‌లో నాకు నచ్చని లక్షణం అదే.. టీవీకే చీఫ్ సీక్రెట్స్ బయటపెట్టిన త్రిష


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ అనూహ్యం విజయం సాధించారు. ఆయన నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో, విజయ్ వ్యక్తిత్వం గురించి నటి త్రిష గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. విజయ్, త్రిష ‘గిల్లి’, ‘కురువి’, ‘లియో’ వంటి కొన్ని చిత్రాలలో కలిసి నటించారు. చాలా సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో, విజయ్‌లో తనకు నచ్చని ఒక విషయం గురించి త్రిష బహిరంగంగా మాట్లాడింది. ఇప్పుడు అదే విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ‘విజయ్ షూటింగ్ సెట్‌లో చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. షూటింగ్ లేకపోయినప్పుడు కూడా సెట్లో విజయ్ అందరితో మాట్లాడకుండా ఓ మూల కూర్చొని గంటలతరబడి గోడ వైపు చూస్తూ ఉంటాడు. నాకు ఆ మౌనం నచ్చదు.. మొదట్లో అతని నిశ్శబ్దం నాకు భరించరానిదిగా అనిపించింది. దానివల్ల అతనిపై నాకు తప్పుడు అభిప్రాయం ఏర్పడింది. కానీ ఆ తర్వాతే అసలు విషయం తెలుసుకున్నా. కానీ విజయ్ ఒక సైలెంట్ కిల్లర్. ‘అతను ఏమీ మాట్లాడకుండానే తన ప్రజెన్స్ తో అందరినీ ఆకర్షించగలడు. విజయ్ నోరు తెరచి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన్ని అందరూ ఇష్టపడతారు. నిజం చెప్పాలంటే ‘గిల్లి’ సినిమా సమయంలో మా ఇద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉండేది కాదు. దర్శకుడు ధరణి, టీమ్ వల్ల మేము మంచి స్నేహితులమయ్యాం. విజయ్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ సహనంతో ఉంటాడు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఇష్టపడే వ్యక్తుల్లో విజయ్ ఒకరు. నా దృష్టిలో హోమ్ అంటే ఇల్లు మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి. నాకు అలాంటి వ్యక్తి విజయ్. అతడితో ఉంటే నాకు చాలా సేఫ్టీగా అనిపిస్తుంది’ అని త్రిష చెప్పుకొచ్చింది.

ఇవి ఓల్డ్ కామెంట్స్ అయినా విజయ్- త్రిషల రిలేషన్ షిప్ రూమర్ల నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా త్రిష చెప్పినట్లుగానే ఇప్పుడు విజయ్ రాజకీయ రంగంలో ఒక ‘నిశ్శబ్ద’ విప్లవాన్ని సృష్టించారు. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 108 సీట్లు గెలుచుకుని ఆయన అద్భుతం చేశారు. అయితే, ఆయనకు ఇంకా మెజారిటీ మార్కు (118) రాకపోవడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆలస్యమవుతోంది. అయితే ఇప్పుడీ సమస్య కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే రేపు (మే 10) ఉదయమే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *