TOSS 10th & Inter Hall Tickets 2026: మరో 2 రోజుల్లో ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

TOSS 10th & Inter Hall Tickets 2026: మరో 2 రోజుల్లో ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు.. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే


హైదరాబాద్‌, ఏప్రిల్ 17: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్లు TOSS ప్రకటించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తమ జిల్లా, స్కూల్‌, పేరు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్‌ 20 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. ఇక ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్ పరీక్షలు ఆయా తేదీల్లో ప్రతి రోజూ రెండు సెషన్‌లలో జరగనున్నాయి. ఇంటర్మీడియట్‌ ప్రాటికల్‌ ఎగ్జామ్స్‌ ఏప్రిల్‌ 28 నుంచి మే 5 వరకు జరగనున్నట్లు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) వెల్లడించింది.

తెలంగాణ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ హాల్‌టికెట్ల 2026 డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాళోజీ హెల్త్‌ వర్సిటీలో MBBS ఫైనల్‌ ఇయర్‌ పరీక్ష రద్దు.. కారణం ఇదే!

తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్‌ 16న జరిగిన ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ జనరల్‌ సర్జరీ పేపర్‌ 1 పరీక్షను వర్సిటీ రద్దు చేసింది. ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్‌ 27న నిర్వహిస్తామని వర్సిటీ అధికారులు వెల్లడించారు. క్వశ్చన్‌ పేపర్‌లో కొన్ని పొరపాట్లు జరిగాయని, అందువల్ల ఈ పరీక్షను రద్దు చేసినట్లు తెలిపారు. పేపర్‌ 2 సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నలను పేపర్‌ 1లో వచ్చినట్లు గుర్తించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *