Headlines

Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..


సామాజిక మాధ్యమాల్లో సినీ తారల చిన్ననాటి జ్ఞాపకాలు, త్రోబ్యాక్ చిత్రాలు నిత్యం సందడి చేస్తుంటాయి. తాజాగా ఇద్దరు దక్షిణాది అగ్ర కథానాయకుల బాల్యపు ఫోటో ఒకటి నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సీనియర్ నటుడి చెంతన కూర్చున్న ఆ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో అపారమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్న స్టార్ హీరోలు. అంతేకాదు, నిజ జీవితంలోనూ వీరిద్దరూ మంచి మిత్రులు. ఇంతకీ ఆ చిత్రంలో కనిపిస్తున్న ఆ ఇద్దరు స్టార్లు మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, దళపతి విజయ్. ఆ పాత చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న సీనియర్ నటుడు సూర్య తండ్రి శివకుమార్ కాగా, ఆయనకు ఇరువైపులా సూర్య, విజయ్ ఉన్నారు. సినీ కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చిన వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో సన్నిహిత సంబంధం ఉంది.

ఎక్కువ మంది చదివినవి: Jaya Prada : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. చాలా మంచి వ్యక్తి.. హీరోయిన్ జయప్రద..

వయసులో సూర్య కంటే విజయ్ ఒక ఏడాది పెద్దవారు. వీరిద్దరూ చెన్నైలోని ప్రఖ్యాత లయోలా కళాశాల లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. కళాశాల రోజుల నుంచే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నేటికీ తమ కాలేజీ పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో తాను, విజయ్ ఎంతో చురుగ్గా మాట్లాడుతూ ఉంటామని సూర్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమిళ చిత్రసీమతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల్లోనూ వీరిద్దరికీ విశేషమైన క్రేజ్ ఉంది. వ్యక్తిగత జీవితంలో కుటుంబ వేడుకలు, సినిమా ప్రివ్యూలు, పార్టీలలో కలుసుకోవడమే కాకుండా, పలు సేవా, దాతృత్వ కార్యక్రమాల్లోనూ వీరు భాగస్వాములవుతుంటారు. వెండితెరపై కూడా వీరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించింది.

ఎక్కువ మంది చదివినవి: Akkineni : అన్నపూర్ణ సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. 1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..

1997లో వచ్చిన ‘నెరుక్కు నేర్’ చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ, ఆ తర్వాత ‘ఫ్రెండ్స్’ సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు మిత్రులు వేర్వేరు రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. సూర్య వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుండగా, మరోవైపు విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ఎన్నికలపై దృష్టి సారించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా చిన్ననాటి నుంచే కలిసి పెరిగి, నేడు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సూర్య, విజయ్‌ల త్రోబ్యాక్ ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

సూర్య, విజయ్..

Suriya, Cm Vijay

Suriya, Cm Vijay

ఎక్కువ మంది చదివినవి: Raghu Babu : కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు ఆయనే.. ఒక్క సినిమాతో 25 ఏళ్ల ఆస్తులు అమ్ముకున్నాం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *