Headlines

Tollwood : స్టార్ హీరోలతో సినిమాలు.. యాక్టింగ్ వదిలేసి సివిల్స్ ప్రీపరేషన్.. ఇప్పుడు జిల్లా కలెక్టర్..


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ నటి గురించి ఆసక్తికర విషయం వైరల్ అవుతుంది. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి విపరీతమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే స్టార్ హీరోయిన్ కావాల్సిన ఈ అమ్మాయి… అనుహ్యంగా నటనకు గుడ్ బై చెప్పింది. తన తండ్రి డ్రీమ్ కోసం యూపీఎస్సీకి ప్రీపేర్ అయ్యి పట్టుదలతో అనుకున్న ఉద్యోగం సాధించింది. సినిమాలకు దూరమై ఇప్పుడు ప్రజాసేవలో బిజీగా ఉండిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి మరెవరో కాదు..హెచ్. ఎస్. కీర్తన. ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ తమమిళం, మలయాళీ ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

హెచ్.ఎస్. కీర్తన.. సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ చైల్డ్ ఆర్టి్స్ట్. కర్పూర గొంబే, గంగా యుమనా, ముద్దిన అలయా, ఉపేంద్ర, లేడీ కమిషనర్ వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే స్టార్ హీరోయిన్ అవకాశాలు వచ్చినప్పటికీ నటనకు గుడ్ బై చెప్పేసి తన కొత్త దారిని ఎంపిక చేసుకుంది. 2013లో తొలిసారి యూపీఎస్సీ పరీక్ష రాశారు. కానీ విజయం సాధించలేదు. అలా మొదటి ఐదు ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ ఆమె తన ఆత్మవిశ్వాసంతో పోరాడింది. 2020లో ఆరవ ప్రయత్నంలో కీర్తన 167 ర్యాంక్ సాధించింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

2011లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీ్ పరీక్షను క్లియర్ చేసి రెండేళ్లపాటు కేఏఎస్ అధికారిగా పనిచేసింది. ఆ తర్వాత యూపీఎస్సీ సీఎస్ఇ లక్ష్యంగా ముందుకు సాగింది. సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొని తనకు నచ్చిన దారిలో ప్రయాణించింది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన ఆమె.. ఇప్పుడు జిల్లా కలెక్టర్ హోదాలో విధులు నిర్వహిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *