Headlines

The Paradise: నాని ‘ ది ప్యారడైజ్’ సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా? నెట్టింట వీడియో వైరల్


న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో మాత్రం నాని మూవీ అదరగొడుతోంది. ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ది ప్యారడైజ్ మొత్తం నాలుగు రోజుల్లో రూ. 155 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ నాని సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఓవర్సీస్ లోనూ ది ప్యారడైజ్ కు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. అలాగే శికంజా మాలిక్ అనే కరడు గట్టిన విలన్ పాత్రలో మోహన్ బాబు నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. వీరితో పాటు రాఘవ్ జుయేల్, సంపూర్ణేష్‌, ప్రియదర్శి, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ది ప్యారడైజ్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న నేపథ్యంలో ఈ మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో సీనియర్ నటుడు, కమెడియన్ బాబు మోహన్ కూడా నటించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నాని ది ప్యారడైజ్ సినిమాలో తాను కూడా ఓ కీలక పాత్రలో నటించానని ఆ సందర్భంలో చెప్పుకొచ్చారు.

‘నాని సినిమా ది ప్యారడైజ్‌లో నేను కూడా నటిస్తున్నాను. ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది. నేను మొదటిసారి ఈ సినిమా కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నాను. ఐదు రకాల గెటప్స్‌లో అనుకున్నారు.. కానీ ఫస్ట్ గెటప్‌ చూసి డైరెక్టర్‌ ఒకే అనేశారు. ఏ గెటప్ వేసినా నా ముఖానికి సూట్ అవుతుంది’ అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బాబు మోహన్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మరి బాబు మోహన్ కు సంబంధించిన సన్నివేశాలను తొలగించారా? లేక ఆయనే నటించలేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంపై అటు ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం కానీ, ఇటు బాబు మోహన్ కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

ఇవి కూడా చదవండి



నాలుగు రోజుల్లో 155 కోట్లకు పైగానే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *