Headlines

Thalliki Vandanam: ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్! మీ అకౌంట్‌కి ఆధార్ లింక్ అయ్యిందా?

Thalliki Vandanam: ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్! మీ అకౌంట్‌కి ఆధార్ లింక్ అయ్యిందా?


అమరావతి, మే 13: తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జూన్‌ 19వ తేదీన జమ చేయనుంది. విద్యార్ధుల తల్లిదండ్రులు బ్యాంకు అకౌంటు ఆధార్ తో లింక్ అయిందో లేదో చెక్‌ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆధార్‌ నంబర్‌తో బ్యాంకు NPCI మ్యాపర్‌లో లింక్‌ అయిందో లేదో ఈ కింది విధంగా సులువుగా చెక్ చేసుకోండి.

మీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ నంబర్ లింక్‌ అయిందో లేదో ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో సందర్శించాలి.
  • అందులో My Aadhaar సెక్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • Aadhaar Services కింద Check Aadhaar/ Bank Linking Status లోకి వెళ్లాలి.
  • అక్కడ మీ 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్‌ చేయాలి.
  • send OTPపై క్లిక్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది.
  • OTP నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే స్క్రీన్‌పై ఏ బ్యాంకు ఖాతాకు లింక్‌ అయి ఉందో.. దాని లింకింగ్‌ స్థితి మీకు కనిపిస్తుంది.

ఒకవేళ NPCI లింక్‌ అవకుంటే రెండు పద్ధతుల ద్వారా లింక్‌ చేయవచ్చు. ఎలాగంటే..

మీ బ్యాంకు బ్రాంచ్‌ను సందర్శించి, ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్‌ ద్వారా ఆధార్‌ నంబర్‌ను మీ అకౌంట్‌కు లింక్ చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే మీ బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి అక్కడి సిబ్బందిని సంప్రదించి నిర్ధారణ చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఒకే ఒక బ్యాంకు ఖాతాను NPCI మ్యాపర్‌కు లింక్‌ చేయాలని అధికారులు తెలిపారు. ఒక వేళ మీరు మరొక బ్యాంకు అకౌంట్‌కు మార్చుకోవాలంటే కొత్త అకౌంట్‌లో NPCI లింకింగ్‌ ప్రక్రియను పూర్తి చేస్తే.. ఆటోమెటిక్‌గా పాత అకౌంట్‌ నుంచి కొత్త అకౌంట్‌కు ఓవర్‌రైడ్‌ అవుతుందని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *