Headlines

రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..

రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..


రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు నటుుడు మురళీ మోహన్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ తన దీర్ఘాయుష్షుకు, శారీరక దృఢత్వానికి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను పంచుకున్నారు. ఆయన ప్రధానంగా తన నిరంతర వాకింగ్ దినచర్య గురించి వివరించారు. ప్రతిరోజు 15,000 అడుగులు నడవాలనే లక్ష్యాన్ని ఆయన పట్టుదలతో పాటిస్తారు. డాక్టర్లు సాధారణంగా 10,000 అడుగులు చాలు అని సిఫార్సు చేసినప్పటికీ, మురళీ మోహన్ దానికంటే ఎక్కువ నడవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఈ 15,000 అడుగుల లక్ష్యాన్ని ఒకేసారి పూర్తి చేయరు. ఆయన వాకింగ్ దినచర్యను రోజులో పలు సెషన్లుగా విభజించుకుంటారు. ఉదయం పూట దాదాపు ఒక గంట పదిహేను నిమిషాల పాటు ఒక స్ట్రెచ్‌లో నడుస్తారు. ఆ తర్వాత, భోజనం చేసిన తర్వాత ఇంట్లోనే సుమారు ఇరవై నిమిషాల పాటు నడుస్తారు. అలాగే, సాయంత్రం మరో సెషన్ ఉంటుంది. ఆ రోజు పడుకునే ముందు, తన ఫిట్‌నెస్ ట్రాకర్‌లో అడుగుల సంఖ్యను చూసుకుని, 15,000 అడుగులకు ఇంకా ఏమైనా తక్కువగా ఉంటే, మిగిలిన దూరాన్ని పూర్తి చేసి పడుకుంటానని మురళీ మోహన్ తెలిపారు.

ప్రయాణాలు లేదా ఇతర కార్యక్రమాల వల్ల తన వాకింగ్ దినచర్యకు అంతరాయం కలిగినా, దాన్ని సరిచేసుకోవడానికి మురళీ మోహన్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఇటీవల ఒక అవార్డు కార్యక్రమానికి వెళ్ళిన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. మొదటి రోజు విమానం ఎక్కే ముందు 15,000 అడుగులు పూర్తి చేశానని తెలిపారు. అయితే, అవార్డు ఇచ్చే రోజు రిహార్సల్స్ ఉండటం వల్ల, ఆ రోజు తక్కువ నడవగలిగారు – కేవలం 7,000-8,000 అడుగులు మాత్రమే. కానీ, ఆయన దానిని మరుసటి రోజు లేదా ఆ వారం రోజుల్లో కంపెన్సేట్ చేస్తానని వివరించారు.

ఒక రోజు షూటింగ్‌లు ఉన్నప్పుడు ఉదయం వాకింగ్ చేయడం కుదరకపోతే, సాయంత్రం వచ్చాక లేదా పడుకునే ముందు కొంత దూరం నడుస్తానని చెప్పారు. కొన్నిసార్లు నిన్నటి లోటును భర్తీ చేయడానికి మరుసటి రోజు 20,000 అడుగులు కూడా నడవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. వారంలో చూసుకుంటే సగటున 15,000 అడుగులు ఉండేలా చూసుకోవడం తన ప్రధాన లక్ష్యమని మురళీ మోహన్ స్పష్టం చేశారు. ఈ విధంగా నిరంతరం తన శరీరాన్ని కదిలిస్తూ, చురుకుగా ఉంచుకోవడం ఆయన ఆరోగ్య సూత్రం. అలాగే తాను టిఫిన్లు చేయనని తెలిపారు. ఇది ఆయన శారీరక, మానసిక ఆరోగ్యం వెనుక ఉన్న ముఖ్యమైన రహస్యమని వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *