Headlines

TG Inter 2026 Supplementary: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా? ఇదే చివరి ఛాన్స్..

TG Inter 2026 Supplementary: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా? ఇదే చివరి ఛాన్స్..


హైదరాబాద్‌, మే 11: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు రూ.7 వేల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు బోర్డు చివరి అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్‌ లేదా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం (మే 11) ముగింపు గడువులోగా ఫీజు చెల్లించవచ్చని సూచించారు. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు చెల్లింపు పొడిగింపు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు ఇక్కడ నేరుగా చెల్లించండి.

కాగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రధాన సబ్జెక్టులు మాత్రం 19వ తేదీతో ముగుస్తాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ థియరీ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్‌ పరీక్షలు జరుగుతాయి. ఇక మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. మే 26న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, మే 28న జరిగే ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షల టైం టేబుల్ ఇదే..

  • మే 13న సెకండ్ లాంగ్వేజ్
  • మే 14న ఇంగ్లిష్‌
  • మే 15న మ్యాథ్స్ ఏ, బోట‌నీ , పొలిటిక‌ల్ సైన్స్
  • మే 16న మ్యాథ్స్ 2ఏ, జువాల‌జీ, హిస్టరీ
  • మే 18న ఫిజిక్స్, ఎకనామిక్స్
  • మే 19న కెమిస్ట్రీ, కామ‌ర్స్
  • మే 20న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ , బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్
  • మే 21న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు ఇక్కడ నేరుగా చెల్లించండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *