
పాపం ప్రతాప్ కథ విషయానికి వస్తే.. 1990ల కాలం నాటి గోదావరి జిల్లా గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రతాప్ అలియాస్ తిరువీర్ తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ అలియాస్ పాయల్ రాధాకృష్ణను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అంతా సంతోషంగా ఉందనుకునేలోపు, పెళ్లయిన మూడు రోజులకే జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల ఊరి పంచాయితీలో ప్రతాప్‌కు ఘోర అవమానం జరుగుతుంది. ఆ దెబ్బతో బుజ్జమ్మ ప్రతాప్‌ను వదిలి వెళ్లిపోతుంది. భార్య దూరమవడంతో ఊరి జనమంతా.. ప్రతాప్‌ను చూసి ‘పాపం ప్రతాప్’ అంటూ జాలి పడుతూనే వెటకారం చేస్తూ ఉంటారు. దీనికి తోడు ప్రతాప్‌కు నిద్రలో ఓ వింత సమస్య కూడా ఉంటుంది. పగలు ఒకలాగా.. పడుకుంటే మరో లాగా మారిపోతుంటాడు ప్రతాప్. ఊరి వాళ్ల హేళనను తట్టుకుని, ప్రతాప్ తన భార్యను మళ్లీ ఎలా దక్కించుకున్నాడు, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుని పాపం ప్రతాప్ కాస్తా వీర ప్రతాప్‌గా ఎలా ఎదిగాడు అనేది మిగతా కథ..