Headlines

Telangana: హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్.. తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..


Telangana: హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్.. తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..

తెలంగాణ పోలీసు శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. ఏకంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఏసీబీ డీజీ, ఆర్టీసీ ఎండీ, సివిల్ సప్లైస్ కమిషనర్ వంటి ముఖ్య స్థానాల్లో మార్పులు జరిగాయి. హైదరాబాద్ నూతన సీపీగా మహేష్ భగవత్ నియమితులు కాగా ప్రస్తుత సీపీ వీసీ సజ్జనార్‌ను ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది.

బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు, వారి కొత్త బాధ్యతల పూర్తి జాబితా..

మహేష్ భగవత్ (1995 బ్యాచ్): డీజీపీగా ఉన్న ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు.

వీసీ సజ్జనార్: హైదరాబాద్ సీపీగా ఉన్న ఈయనను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ డీజీగా బదిలీ చేశారు. దీంతో పాటు ఆయనకు డీజీ, ఎస్‌పీఎఫ్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

డాక్టర్ సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్): జైళ్ల శాఖ డీజీగా ఉన్న ఈమెను డీజీగా బదిలీ చేశారు. అదనంగా డీజీపీ (ఆర్గనైజేషన్), డీజీపీ (లీగల్) బాధ్యతలు కూడా అప్పగించారు.

స్వాతి లక్రా (1995 బ్యాచ్): డీజీపీ (ఆర్గనైజేషన్ & హోంగార్డ్స్)గా ఉన్న ఈమెను జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. హోంగార్డ్స్ డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.

చారు సిన్హా (1996 బ్యాచ్): సీఐడీ డీజీపీగా ఉన్న ఈమెను ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. సీఐడీ డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు.

డాక్టర్ అనిల్ కుమార్ (1996 బ్యాచ్): గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ డీజీపీగా ఉన్న ఈయనను టీజీఎస్‌ఆర్టీసీ వైస్-చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

వై. నాగిరెడ్డి (1997 బ్యాచ్): ఆర్టీసీ ఎండీగా ఉన్న ఈయనను పౌరసరఫరాల శాఖ కమిషనర్ అండ్ ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

సంజయ్ కుమార్ జైన్ (1997 బ్యాచ్): టీజీఎస్పీ అదనపు డీజీపీగా ఉన్న ఈయనకు అదనపు డీజీపీ (ట్రైనింగ్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

విక్రమ్ సింగ్ మాన్ (1998 బ్యాచ్): ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న ఈయనను గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ డీజీపీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

ఎం. స్టీఫెన్ రవీంద్ర (1999 బ్యాచ్): సివిల్ సప్లైస్ కమిషనర్‌గా ఉన్న ఈయనను తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

అకున్ సబర్వాల్ (2001 బ్యాచ్): పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈయనను అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా నియమించారు. అదనంగా కోఆర్డినేషన్, టెక్నికల్ సర్వీసెస్ ఏడీజీపీ బాధ్యతలు అప్పగించారు.

ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (2004 బ్యాచ్): మల్టీ జోన్-1 ఐజీగా ఉన్న ఈయనను ఏసీబీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఇప్పటివరకు అదనపు బాధ్యతల్లో ఉన్న అవినాష్ మహంతిని రిలీవ్ చేశారు.

కార్తికేయ (2006 బ్యాచ్): ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ఈయనను మల్టీ జోన్-1 ఐజీగా బదిలీ చేశారు. అదనంగా ఐసీసీసీ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.

కె. రమేష్ నాయుడు (2006 బ్యాచ్): రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీగా ఉన్న ఈయనను రైల్వేస్ ఐజీగా బదిలీ చేశారు. ఈయన TG-TMARS డైరెక్టర్‌కు రిపోర్ట్ చేస్తారు.

డి. జోయల్ డేవిస్ (2010 బ్యాచ్): హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా ఉన్న ఈయనను TG-TMARS లో రోడ్ సేఫ్టీ & ట్రాఫిక్ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా పూర్తి అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు.

జి. చందన దీప్తి (2012 బ్యాచ్): ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ జాయింట్ సీపీగా ఉన్న ఈమెకు జోన్-7 (జోగుళాంబ) డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఆర్. భాస్కరన్ (2012 బ్యాచ్): ఇంటెలిజెన్స్ సీఐ సెల్ డీఐజీగా ఉన్న ఈయనకు డీఐజీ (ఇంటెలిజెన్స్)గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.

కె. నారాయణ నాయక్ (2009 బ్యాచ్): సీఐడీ డీఐజీగా ఉన్న ఈయనకు జోన్-2 (బాసర) డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఎల్.ఎస్. చౌహాన్ (2009 బ్యాచ్): జోగుళాంబ జోన్-7 డీఐజీగా ఉన్న ఈయనను డీఐజీ (కోఆర్డినేషన్)గా బదిలీ చేశారు. అదనంగా జోన్-6 (చార్మినార్) డీఐజీ బాధ్యతలు అప్పగించారు.

శ్రీబాలా దేవి: పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈమెను TG-TMARS డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్)గా నియమించారు.

వి. అరవింద బాబు: పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈయనను హైదరాబాద్ సిటీ డీసీపీ గా నియమించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *