Tamannah : 16 ఏళ్లుగా న్యాయ పోరాటం.. తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..

Tamannah : 16 ఏళ్లుగా న్యాయ పోరాటం.. తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..


Tamannah : 16 ఏళ్లుగా న్యాయ పోరాటం.. తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..

మద్రాస్ హై కోర్టులో నటి తమన్నా భాటియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఒక ప్రైవేట్ సోప్ కంపెనీపై ఆమె దాఖలు చేసిన రూ.1 కోటి పరిహారం పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసు దాదాపు 16 ఏళ్ల క్రితం నాటిది. 2008 అక్టోబర్‌లో తమన్నా ఓ సోప్స్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఒక ఏడాది పాటు (అక్టోబర్ 2009 వరకు) ఆ సంస్థ ఉత్పత్తులకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలి. అయితే, ఒప్పందం ముగిసిన తర్వాత కూడా సదరు కంపెనీ తన ఫోటోలను ప్రకటనల్లో, సోప్ ప్యాకింగ్‌లపై వాడుతోందని తమన్నా ఆరోపించారు. 2010, 2011 కాలంలో తన అనుమతి లేకుండా చిత్రాలను వాడటం వల్ల తన వృత్తిపరమైన అవకాశాలు దెబ్బతిన్నాయని, మార్కెట్ విలువ తగ్గిందని ఆమె వాదించారు. దీనికిగానూ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు..

తొలుత ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి బెంచ్, తమన్నా సమర్పించిన సాక్ష్యాధారాలు సరిగ్గా లేవని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై ఆమె మద్రాస్ హైకోర్టులోని డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేశారు. ఏప్రిల్ 16, 2026న ఈ అప్పీలుపై విచారణ చేపట్టిన జస్టిస్ పి. వేల్మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవతిలతో కూడిన ధర్మాసనం పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. తమన్నా సమర్పించిన సోప్ రాపర్లు (Wrappers), కొనుగోలు రసీదులు సదరు కంపెనీకి చెందినవేనని నిరూపించడానికి బలమైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: మీ కోసమే అంటూ ప్రేమగా 8 నెలలు స్లో పాయిజన్ ఇచ్చింది.. డాక్టర్ మాటలు విని షాకయ్యా.. జేడీ చక్రవర్తి

ఆ ప్రకటనలు ఒప్పంద కాలం తర్వాతే వచ్చాయని చెప్పడానికి సాంకేతికపరమైన లేదా నిర్దిష్టమైన ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తూ, అప్పీలును తోసిపుచ్చింది. ఈ తీర్పుతో సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ న్యాయపోరాటం ముగింపుకు వచ్చినట్లయింది. సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్ ఒప్పందాల్లో సాక్ష్యాధారాల ప్రాముఖ్యతను ఈ కేసు మరోసారి గుర్తు చేసింది.

ఎక్కువ మంది చదివినవి :  Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *