Suman Shetty: 300 సినిమాల్లో నటించా.. నంది అవార్డు కూడా వచ్చింది.. కానీ ఇప్పుడు.. ఎమోషనలైన సుమన్ శెట్టి

Suman Shetty: 300 సినిమాల్లో నటించా.. నంది అవార్డు కూడా వచ్చింది.. కానీ ఇప్పుడు.. ఎమోషనలైన సుమన్ శెట్టి


Suman Shetty: 300 సినిమాల్లో నటించా.. నంది అవార్డు కూడా వచ్చింది.. కానీ ఇప్పుడు.. ఎమోషనలైన సుమన్ శెట్టి

 

సుమన్ శెట్టి.. ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌. తొలి సినిమా ‘జయం’తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుమన్. అందులో ‘అధ్యక్షా..’ అంటూ అతను చేసిన కామెడీకి తెలుగు ఆడియన్స్‌ కడుపుబ్బా నవ్వుకున్నారు. జయం తర్వాత సుమన్‌కి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. స్టార్ కమెడియన్ గా బిజీ బిజీ అయిపోయారు. ఎంతలా అంటే ఒకనొక దశలో ఆయన డేట్స్‌ కూడా దొరకనంత. ఇప్పటివరకు సుమారు 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు సుమన్ శెట్టి. అయితే ఏమైందో తెలియదు కానీ సడెన్‌గా వెండితెరకు దూరం అయ్యాడు. చాలా ఏళ్ల పాటు సినిమాల్లో కనిపించలేదు. టీవీ షోలోనూ కనిపించలేదు. అయితే గతేడాది బిగ్ బాస్ సీజన్ 9 తో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు సుమన్ శెట్టి. తన ఆట, మాట తీరుతో దాదాపు 14 వారాల పాటు హౌస్‌లో ఉండి బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఫినాలేకు కేవలం ఒక్కవారం ముందు ఎలిమేట్‌ అయ్యి బయటకు వచ్చేశాడు. బిగ్‌బాస్ హౌస్ లో సుమన్ శెట్టి పెర్ఫామెన్స్ చూసిర‌ తర్వాత అతను కెరీర్‌ పరంగా బిజీ అయిపోతారనుకున్నారు.కానీ అదేమీ జరగలేదు. ఇప్పటికీ అతనికి పెద్దగా సినిమా అవకాశాలు అయితే రావడం లేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుమన్ శెట్టి ఇదే విషయంపై మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. 300పైగా సినిమాలతో పాటు నంది అవార్డు కూడా దక్కించుకున్న తనకు సినిమా అవకాశాలు ఎందుకు రావట్లేదు అర్ధం కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ అనేది ఎలా ఉంటుందో నాకు పెద్దగా తెలియదు. ఒకానొక సమయంలో నెలకు 30 రోజులు ఉంటే ఆ 30 రోజులు కూడా షూటింగ్ లో పాల్గొన్నాను. 300కు పైగా సినిమాల్లో నటించాను. ఒక నంది అవార్డు కూడా వచ్చింది. సినిమాల్లో నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా అని నేను ఆలోచించే వాడిని కాదు. అయినా కూడా ఇప్పుడు నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదో అర్థం కావడం లేదు. నాకు సినిమా షూటింగ్ తప్ప ఇంకోటి తెలియదు. అవకాశం ఇస్తే ప్రాణం పెట్టి పని చేస్తా. నాలో ఉన్న లోపం ఏంటి? నటన విషయంలో ఎక్కడైనా తాను తగ్గిపోయానా? అనే సందేహాలు కూడా తనను వెంటాడుతున్నాయి’అని సుమన్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Suman Shetty (@actorsumanshetty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *