Headlines

Stree Nidhi Jobs 2026: తెలంగాణ మహిళా డ్వాక్రా స్త్రీ నిధి సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ మీదే

Stree Nidhi Jobs 2026: తెలంగాణ మహిళా డ్వాక్రా స్త్రీ నిధి సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ మీదే


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్వయం సహాయక సంఘాల (SHG) సమాఖ్యల ఉమ్మడిగా ప్రోత్సహక సంస్థ అయిన స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్.. వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవల్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ ప్రకటన వెలువరించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 123 అసిస్టెంట్ మేనేజర్ (ఫీల్డ్ ఆపరేషన్స్) పోస్టులకు భర్తీ చేయనుంది. ఇది తెలంగాణ గా స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వ్యవహరిస్తుంది. ఈ సంస్థ తెలంగాణ ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తుంది. డిగ్రీ అర్హత కలగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మే 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కేటగిరీల వారీగా పోస్టు వివరాలు ఇవే..

  • ఓసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 60
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 3
  • బీసీ-ఏ కేటగిరీలో పోస్టుల సంఖ్య:16
  • బీసీ-బి కేటగిరీలో పోస్టుల సంఖ్య: 2
  • ఓహెచ్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 9
  • ఎస్సీ (గ్రూప్‌1) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 4
  • ఎస్సీ(గ్రూప్‌2) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 26
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 3

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 65 శాతం మార్కుల ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి. కంప్యూటర్‌లో ఎంఎస్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఎంపికైన వారు సొంతంగా బైక్‌ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మే 29, 2062వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.770, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.885 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు మొత్తం సుమారు రూ.33,960 జీతంతోపాటు ప్రయాణ అలవెన్స్, పనితీరు ఆధారిత వేరియబుల్ పే వంటివి కలిసి చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష ఎలా ఉంటుందంటే?

రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లిష్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, బ్యాంకింగ్‌తో కూడిన జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు చొప్పున అడుగుతారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు. పరీక్ష 90 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది.

తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *