Stock Market: దుమ్మురేపిన స్టాక్.. ఒకే రోజు రూ.2,300 పెరిగిన షేరు ధర.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

Stock Market: దుమ్మురేపిన స్టాక్.. ఒకే రోజు రూ.2,300 పెరిగిన షేరు ధర.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!


Stock Market: దుమ్మురేపిన స్టాక్.. ఒకే రోజు రూ.2,300 పెరిగిన షేరు ధర.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి తొలగిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి ప్రకటన మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సానుకూల పవనాలతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయి లాభాలను మూటగట్టుకున్నాయి. ఏప్రిల్ 8 సెన్సెక్స్ 2,946 పాయింట్లు పెరిగి 77,563 వద్ద ముగిసింది. అదే నిఫ్టీ 873 పాయింట్లు (3.78%) ఎగబాకి 23,997 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.16 లక్షల కోట్ల సంపద పెరిగింది.

ఫోర్స్ మోటార్స్ (Force Motors) ప్రభంజనం:

మార్కెట్ జోష్‌కు తోడు అద్భుతమైన అమ్మకాల గణాంకాలతో ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్స్ మోటార్స్ షేరు దుమ్మురేపింది. ఒక్కరోజే ఈ షేరు ధర ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను అందించింది. ప్రారంభ ధర: క్రితం ముగింపు రూ.19,920 కాగా, బుధవారం ఏకంగా రూ. 20,900 వద్ద ఓపెన్ అయింది. గరిష్ఠ స్థాయి: ఇంట్రాడేలో 12% పెరిగి రూ. 22,290 మార్కును తాకింది. ఇక ముగింపు: చివరికి 11.10% లాభంతో రూ. 22,131 వద్ద స్థిరపడింది. నికర లాభం: ఒక్కో షేరుపై ఒకే రోజు దాదాపు రూ. 2,211 నుంచి రూ. 2,350 వరకు పెరగడం విశేషం.

ఇది కూడా చదవండి: Silver Price: మహిళలకు శుభవార్త.. ఏకంగా రూ.50 వేలు తగ్గిన వెండి ధర.. ఇంకా తగ్గుతుందా?

ఎందుకీ దూకుడు?

ఫోర్స్ మోటార్స్ షేరు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం కంపెనీ సాధించిన అమ్మకాల వృద్ధి. సేల్స్ గ్రోత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దేశీయంగా 36,536 యూనిట్లను విక్రయించింది. వార్షిక వృద్ధి గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 20 శాతం మేర పెరగడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. మార్కెట్ సెంటిమెంట్ యుద్ధ భయాలు తొలగి, చమురు సరఫరా పునరుద్ధరణపై ట్రంప్ హామీ ఇవ్వడం ఆటో రంగానికి బూస్ట్‌నిచ్చింది.

ఇది కూడా చదవండి: Gold Price Drop: పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం ధర.. ఇంకా తగ్గుతుందా?

ముఖ్య గమనిక: ఫోర్స్ మోటార్స్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 26,450 కాగా, కనిష్ఠ ధర రూ. 8,300. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 29.10 వేల కోట్లుగా ఉంది. ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక ఏంటంటే.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి: D-Mart: డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు.. రాధాకిషన్ దమానీనా మజాకా..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *