SRH vs DC: సెంచరీతో అభి ‘షేకింగ్’.. ఢిల్లీ ముందు కొండంత టార్గెట్..

SRH vs DC: సెంచరీతో అభి ‘షేకింగ్’.. ఢిల్లీ ముందు కొండంత టార్గెట్..


Sunrisers Hyderabad vs Delhi Capitals, 31st Match, Indian Premier League 2026: ఐపీఎల్ 2026లో భాగంగా 31వ మ్యాచ్‌లో, అభిషేక్ బచ్చన్ సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC)కు 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 135 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతను తన 68 బంతుల ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు. హెన్రిచ్ క్లాసెన్ 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ 66 పరుగుల నాటౌట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభిషేక్‌తో పాటు, ట్రావిస్ హెడ్ 37 పరుగులు, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు. ఢిల్లీ తరఫున, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా, ఒక బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యాడు.

రెండు జట్లు..

సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ.

ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆర్. స్మరన్, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, దిల్షన్ మధుశంక, హర్షల్ పటేల్.

ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, ముఖేష్ కుమార్, నటరాజన్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: త్రిపూర్ణ విజయ్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, దశమంత చమీరా, ఆకిబ్ నబీ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *