Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్

Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన  శివ చౌహాన్


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోట్లాది రూపాయల మైక్రో ఫైనాన్స్ స్కామ్! అసలు ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? అమాయక సామాన్యుల కష్టార్జితం ఎవరి జేబుల్లోకి వెళ్లింది? బాధితులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ మొత్తం వ్యవహారంలోసింగర్ మంగ్లీ పేరు ఎందుకు వినిపిస్తోంది? ఆమెపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. అయితే, ఈ సంచలన కేసు గురించి తాజాగా మంగ్లీ తమ్ముడు ఎట్టకేలకు నోరు విప్పారు! అక్క మంగ్లీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొందరు కుట్రపూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైక్రో ఫైనాన్స్‌ కేసులో సింగర్‌ మంగ్లీపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె తమ్ముడు శివ చౌహన్ స్పష్టం చేశారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యవహారంపై స్పష్టతనిచ్చారు. గత నెల రోజులుగా తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అసత్యమని కొట్టిపారేశారు. ప్రధానంగా మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కేవలం మంగ్లీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కుట్రపూరితంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము నమ్మే హనుమంతుడు, సేవాలాల్ సాక్షిగా ఈ స్కామ్‌లో తమ ప్రమేయం లేదని మంగ్లీ తమ్ముడు శివ మీడియా ముందు ప్రమాణం చేశారు. గతంలో హేమాకాంత్ రెడ్డి, రమావత్ మధు అనే వ్యక్తులు తీజ్ పండుగ విషయం మాట్లాడటానికి తమ వద్దకు వచ్చారని శివ చౌహన్ తెలిపారు. ఆ సమయంలో తన అక్క మంగ్లీ..వారికి తన ఫోన్ నంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పిందని వెల్లడించాడు. జూన్ 9 వ తేదీన తాము ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ముగించుకుని వస్తుండగా వారు.. తమ గ్రామంలో డిన్నర్ కి ఆహ్వానించడంతో తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. డిన్నర్ తర్వాత అందరం కలిసి ఫోటోలు దిగామని వివరించారు. వెంచర్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మంగ్లీని రమ్మని ఆ సందర్భంగా వారు కోరగా ఇటువంటి కార్యక్రమాలకు ఆమె హాజరుకారని..తాను వారికి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఆ మరుసటి రోజే అక్క పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఏర్పాట్ల కోసం హడావిడిగా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.అయితే, అప్పుడు పండుగ సందర్భంలో దిగిన ఫొటోలను ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో ముడిపెట్టడం అంత్యంత బాధాకరమని అన్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ ప్లాట్ కోసం అగ్రిమెంట్ చేసుకున్న సమయంలో జరిగిన పరిచయాన్ని అడ్డుపెట్టుకుని, డబ్బులు తీసుకున్నట్లు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ తమ్ముడు మండిపడ్డారు. ఆ తర్వాత తాము లేని సమయంలో కూడా హేమాకాంత్ రెడ్డి, రమాకాంత్ తమ ఊరికి వచ్చారని వెల్లడించారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్‌కు సంబంధించి నమోదైన 60 నుండి 90 కేసుల్లో ఎక్కడా తమ పేర్లు లేవని ఆయన గుర్తు చేశారు బాధితులు ఎవరూ తమ పేర్లు ప్రస్తావించలేదని, అడ్వకేట్ సుబ్బారావు కోర్టులో పోరాడకుండా మీడియా ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తామెప్పుడూ ఎవరినీ బెదిరించలేదని, కనీసం మెసేజ్ లేదా కాల్ కూడా చేయలేదని వెల్లడించారు. ఈ నిరాధార ఆరోపణల వల్ల తమ కుటుంబ పరువుకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో తమకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు. పద్నాలుగేళ్లుగా ఎన్నో కష్టాలు పడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చామని పేర్కొన్నారు. బాధితుల తరపున తాము కూడా పోరాడుతామని నిజం త్వరలోనే వెలుగులోకి వస్తుందని శివ చౌహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అలాగే, మంగ్లీపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆమె మేనేజర్ మేఘ్ రాజు ఖండించారు. స్కామ్‌ కేసులో మంగ్లీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొన్ని యూ ట్యూబ్ చానెల్స్ అసభ్యకర పోస్టులు పెడుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా కొన్ని యూట్యూబ్‌ చానెల్స్‌ పనిగట్టుకుని చేస్తోన్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధితులకు అండగా ఉంటానని మంగ్లీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా మధు నాయక్, సుబ్బు, తిరుమలేష్, హిమకాంత్ రెడ్డి లాంటి వ్యక్తులతో పాటు కొన్ని ఛానల్స్ కావాలనే ఆమెపై బురద జల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మంగ్లీని మాత్రమే కాకుండా, ఆమె కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. అసలు మంగ్లీపై ఆరోపణలు చేసిన హిమకాంత్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడని ఆయన నిలదీశారు. సదరు మైక్రో ఫైనాన్స్ వ్యాపారం గురించి మంగ్లీ ఎక్కడా ఎండార్స్‌మెంట్ చేయలేదని, ఆమెపై జరుగుతున్న గోబెల్ ప్రచారం మానుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసులో మంగ్లీ ప్రమేయంపై విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే అన్ని నిజనిజాలు బయటకొస్తాయని మేఘ్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి మైక్రో ఫైనాన్స్ స్కామ్‌ కేసులో తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంగ్లీ తమ్ముడు శివ చౌహన్ స్పష్టం చేయడంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. తమ కుటుంబానికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. పోలీసులు విచారణ కొనసాగుతోందని, త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక

నాడు “మీసాల పిల్ల” అంటూ ఎగతాళి.. నేడు స్టేట్‌ టాపర్ గా సక్సెస్

డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్‌ ఏం చేసాడంటే

రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *