Sadhguru 360: సద్గురు సరికొత్త ప్రోగ్రామ్.. హిందూ క్యాలెండర్ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?

Sadhguru 360: సద్గురు సరికొత్త ప్రోగ్రామ్.. హిందూ క్యాలెండర్ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?


ఆధ్యాత్మికవేత్త, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రేక్షకులతో నేరుగా సంభాషించే ఉద్దేశంతో రూపొందించిన సద్గురు 360 అనే ప్రత్యేక సోలోకాస్ట్ సిరీస్‌ను ఆయన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ప్రారంభించారు. ఆధ్యాత్మిక అంశాల నుండి సమకాలీన జీవనశైలి వరకు అనేక అంశాలను అన్వేషిస్తూ, వీక్షకులకు తనదైన నిష్కపటమైన దృక్పథాన్ని ఈ సిరీస్ ద్వారా సద్గురు అందించనున్నారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో సద్గురు కాలం లోతైన స్వభావం గురించి వివరించారు. ముఖ్యంగా ప్రాచీన హిందూ క్యాలెండర్ దృష్టికోణం ద్వారా కాలం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన అన్వేషించారు. హిందూ క్యాలెండర్ కేవలం రోజులను లెక్కించే సాధనం మాత్రమే కాదని, అది మనిషిని విశ్వంతో ఎలా అనుసంధానిస్తుందో సద్గురు వివరించారు. కేవలం ఆనందం, సంతృప్తితో కూడిన జీవితం కోసమే కాకుండా, పరమ ఐక్యతను చేరుకోవడానికి ఈ ప్రాచీన వ్యవస్థలు ఎలా ఉపయోగపడతాయో ఆయన వివరించారు.

సద్గురు 360 – ప్రత్యేకతలేంటి?

మిగతా ఇంటర్వ్యూలు లేదా ప్రసంగాలతో పోలిస్తే ఈ సోలోకాస్ట్ ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సద్గురు ప్రేక్షకులతో నేరుగా ముఖాముఖి మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా, సమకాలీన అంశాలను జోడిస్తూ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న వారికి ఈ సిరీస్ ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. బుద్ధ పౌర్ణమితో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇకపై ప్రతి పౌర్ణమి నాడు ఒక కొత్త ఎపిసోడ్ రూపంలో ముందుకు సాగుతుంది. సద్గురు లోతైన అంతర్దృష్టులను వీక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా చేరువ చేయడమే ఈ సిరీస్ ప్రధాన లక్ష్యం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *