Sachin Tendulkar : ఈ ఒక్క మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది.. క్రికెట్ దేవుడి నోట సక్సెస్ మంత్రం

Sachin Tendulkar : ఈ ఒక్క మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది.. క్రికెట్ దేవుడి నోట సక్సెస్ మంత్రం


Sachin Tendulkar : ఏప్రిల్ 24.. భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన రోజు. భారతీయులు క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు నేడు. దశాబ్దాల పాటు కోట్లాది మంది కలలను తన భుజాలపై మోసిన ఈ మాస్టర్ బ్లాస్టర్, కేవలం రికార్డులకే పరిమితం కాలేదు. ఆయన క్రమశిక్షణ, వినయం, ఆటపై ఆయనకున్న అంకితభావం తరతరాలకు ఆదర్శం. ఈ సందర్భంగా సచిన్ గతంలో చెప్పిన ఒక స్ఫూర్తిదాయకమైన మాట నేటి యువతకు ఎంతో అవసరం.

సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ డబ్బు కోసం ఆడలేదు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో ప్లాన్-A ఎప్పుడూ భారత్ తరఫున క్రికెట్ ఆడటమేనని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సమయంలో తనకు ఎంత రెమ్యూనరేషన్ వస్తుందో కూడా తాను ఎప్పుడూ లెక్క చూసుకోలేదట. టీమిండియా జెర్సీ ధరించడం, దేశం కోసం మైదానంలోకి దిగడం కంటే మరేదీ తనకు ఆనందాన్ని ఇవ్వలేదని ఆయన గుర్తు చేసుకున్నారు.

సచిన్ చెప్పిన ఆ పవర్‌ఫుల్ మాట ఏంటంటే?

“మీ ప్రయాణం మీ గుండె లోతుల్లోంచి మొదలైతే, మీరు ఎంత దూరమైనా వెళ్లగలరు. కానీ మీ ప్రయాణం కేవలం మెదడులో మొదలైతే, అక్కడే లెక్కలు మొదలవుతాయి. అప్పుడు మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు చూస్తారు, అలాంటప్పుడు ప్రయాణం కష్టమవుతుంది. అందుకే నేను చెబుతున్నాను.. క్రికెట్ నాకు వృత్తి కాదు, అది నా ప్యాషన్” అని సచిన్ పేర్కొన్నారు. అంటే మనం చేసే పనిని ప్రేమిస్తే, అందులో వచ్చే ఇబ్బందులు మనల్ని ఆపలేవని ఆయన ఉద్దేశ్యం.

నేటి కాలానికి సచిన్ ఫిలాసఫీ ఎందుకు ముఖ్యం?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది కేవలం జీతం, మార్కెట్ ట్రెండ్స్, సామాజిక హోదాను చూసి కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. కానీ, అలా ఎంచుకున్న పనుల్లో ఒత్తిడి పెరిగినప్పుడు లేదా ఆశించిన ఫలితాలు రానప్పుడు నిరుత్సాహం కలుగుతుంది. అదే సచిన్ చెప్పినట్లు మనసు నచ్చిన పనిని ఎంచుకుంటే, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా స్థిరంగా ముందడుగు వేయొచ్చు. డబ్బు ముఖ్యం కాదని కాదు, కానీ అది మీ ప్రారంభ స్థానం కాకూడదనేది సచిన్ సందేశం.

మరో ఏడాది.. అదే స్ఫూర్తి

సచిన్ టెండూల్కర్ 53వ ఏట అడుగుపెట్టినా, ఆయన ఆటపై చూపిన ఆ ప్రేమ ఇప్పటికీ నేటి తరం ఆటగాళ్లకు పాఠం లాంటిది. రికార్డులు ఈరోజు ఉంటాయి, రేపు మరొకరు చెరిపివేయవచ్చు.. కానీ ఒక పనిని ఎంతగా ప్రేమించవచ్చో ప్రపంచానికి నేర్పించిన సచిన్ వ్యక్తిత్వం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. పుట్టినరోజు జరుపుకుంటున్న మాస్టర్ బ్లాస్టర్‌కు కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *