Rohit-Virat : రోహిత్, విరాట్ 2027 వరల్డ్ కప్ ఆడతారా? ఆయన మాటలతో ఓ క్లారిటీ వచ్చేసిందిగా

Rohit-Virat : రోహిత్, విరాట్ 2027 వరల్డ్ కప్ ఆడతారా? ఆయన మాటలతో ఓ క్లారిటీ వచ్చేసిందిగా


Rohit-Virat : టీమిండియా వెటరన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై గబ్బర్ సింగ్.. సారీ.. మన శిఖర్ ధావన్ తనదైన శైలిలో స్పందించారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు జట్టులో కొనసాగడంపై వస్తున్న సందేహాలకు ధావన్ తన అనుభవంతో సమాధానమిచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయంలో మారిన తీరును ధావన్ ప్రత్యేకంగా ప్రశంసించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

టీమిండియా ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మతో వేల పరుగులు సాధించిన శిఖర్ ధావన్, తాజా ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తాడని మనందరికీ తెలుసు, అతను ఎప్పుడూ ఫిట్టే. కానీ రోహిత్ శర్మ గత కొంతకాలంగా తన ఫిట్‌నెస్‌ విషయంలో విపరీతమైన మార్పులు చేసుకున్నాడు. అతని ట్రాన్స్‌ఫర్మేషన్ నిజంగా అద్భుతం” అని ధావన్ కొనియాడారు. 2027 ప్రపంచకప్ నాటికి రోహిత్ శర్మ శారీరకంగా సిద్ధంగా ఉండటం జట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తన కెరీర్ చివరి దశలో కేవలం వన్డేలు మాత్రమే ఆడిన ధావన్, దానివల్ల కలిగే ఇబ్బందులను వివరించారు. “అంతర్జాతీయ స్థాయిలో కేవలం ఒకే ఫార్మాట్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లలో ఆ ఫ్లో దెబ్బతింటుంది. మ్యాచ్‌లు తక్కువగా ఉండటం వల్ల ఫామ్ తప్పుతుంది. అందుకే ప్లేయర్స్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది” అని ధావన్ అన్నారు. అయితే రోహిత్, విరాట్ ఇద్దరూ చాలా పరిణితి చెందిన ఆటగాళ్లని, ఇలాంటి సవాళ్లను అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో వారికి బాగా తెలుసని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఐపీఎల్ 2026లో కోహ్లీ అదరగొడుతున్న తీరు, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఇస్తున్న ప్రదర్శనను ధావన్ గుర్తుచేశారు. ఐపీఎల్ మినహా ప్రస్తుతం ఈ ఇద్దరూ అంతర్జాతీయంగా కేవలం వన్డేల్లోనే ఆడుతున్నారు. “ముందు ముందు భారత్ ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. కాబట్టి 2027 ప్రపంచకప్ నాటికి వారికి తగినంత ప్రాక్టీస్ లభిస్తుంది. మ్యాచ్ ప్రాక్టీస్ సమస్య అవుతుందని నేను అనుకోను. వారికి ఇంకా చాలా సమయం ఉంది” అని ధావన్ విశ్లేషించారు.

వన్డే క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా రోహిత్-ధావన్ రికార్డు సృష్టించారు. భారత తరపున రెండో అత్యుత్తమ ఓపెనింగ్ స్టాండ్ వీరిదే. తమతో పాటు మూడు దశాబ్దాలుగా భారత బ్యాటింగ్ భారమంతా మోసిన కోహ్లీ-రోహిత్ ద్వయం, వచ్చే ప్రపంచకప్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తారని ధావన్ నమ్ముతున్నారు. 2026 ఐపీఎల్ లో కోహ్లీ 165 పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తుండటం, రోహిత్ తన గాయం నుంచి త్వరగా కోలుకొని జట్టులోకి రావాలని గబ్బర్ ఆకాంక్షించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *